తెలుగు సినిమాల్లో నందమూరి బాలకృష్ణ ప్రయాణం ప్రత్యేకం. దర్శకులను పూర్తిగా నమ్మే హీరోగా ఇండస్ట్రీలో బాలయ్యకు పేరు ఉంది. ముప్పయ్యేళ్లకు పైగా ఆయన ప్రస్థానంలో ఆయనకు హిట్లు, సూపర్ హిట్లు బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. ఎందరో హీరోయిన్లతో ఆయన ఆడిపాడారు. ప్రస్తుతం బాలయ్య మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంకా వారెవరో కన్ఫర్మ్ కాలేదు కానీ ఇప్పుడో ఇంటరెస్టింగ్ వార్త ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది.

 

 

ఈ సినిమాలో ఇద్దరు అచ్చ తెలుగు హీరోయిన్లను తీసుకోవాలని బాలయ్య భావిస్తున్నాడని అంటున్నారు. ఈమేరకు దర్శకుడు బోయపాట శ్రీనుకు కూడా సూచన చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకూ పలువురు హీరోయన్ల పేర్లు బాలయ్య పక్కన హీరోయిన్ గా చేస్తున్నారంటూ వార్తలు షికారు చేశాయి. సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ నయనతార, మరో స్టార్ హీరోయిన్ శ్రియ ఈ సినిమాల్లో బాలయ్య పక్కన నటిస్తున్నట్టు చెప్పుకున్నారు. కానీ ఇవేమీ నిజం కాదంటూ కూడా వార్తలు షికారు చేస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే సినిమా యూనిట్ నుంచి అపిషియల్ కన్ఫర్మేషన్ రావాల్సిందే.

 

 

నిజానికి టాలీవుడ్ సీనియర్ హీరోలకు హీరోయిన్లు కొరతగా మారారు. కొత్త హీరోయిన్లు రావడం, సీనియర్ హీరోయిన్లు పెళ్లి చేసుకుని సెటిల్ కావడంతో మన హీరోలకు హీరోయిన్లు కొరతగా మారారు. ఈ పరిస్థితి టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలందరికీ ఉంది. నిజానికి వీరికి త్రిష, శ్రియ, నయనతార.. లాంటి వారు మాత్రమే ఆప్షన్లుగా ఉన్నారు. మరి బాలయ్య సినిమాలో వస్తున్న వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది. మిరియాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను భారీగా నిర్మిస్తున్నారు.                 

మరింత సమాచారం తెలుసుకోండి: