త్రివిక్రమ్ విషయంలో జరుగుతోన్న ప్రచారానికి తెరపడుతోంది. రాజమౌళి చేసిన మార్పులతో త్రివిక్రమ్ ఆలోచనలు కూడా మారుతున్నాయనే టాక్ కు ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ ఎన్ని మార్పులు చేసుకున్నా.. పంచ్ మాస్టర్ మాత్రం గట్టిగా ఫిక్స్ అయ్యాడని చెబుతున్నారు. 

 

రాజమౌళి తర్వాత ప్లేస్ ఎవరిది అంటే చాలామందికి చాలా అభిప్రాయాలు ఉన్నాయి గానీ.. మెజార్టీ త్రివిక్రమ్ కే ఓటేస్తారు. ఇద్దరూ వేర్వేరు జానర్స్ లో ప్రయాణిస్తున్నా.. కలెక్షన్ల లెక్కల్లో పంచ్ మాస్టర్ కు టాప్ 2 ఇచ్చేస్తుంటారు. అయితే ఈ ర్యాంకుల సంగతి పక్కనపెడితే.. ట్రిపుల్ ఆర్ తో త్రివిక్రమ్ ని పెద్ద కన్ ఫ్యూజన్ లో పడేశాడు రాజమౌళి. 

 

రాజమౌళి దర్శకత్వంలో 400 కోట్లకు పైగా బడ్జెట్ తో భారీగా రూపొందుతోంది ట్రిపుల్ ఆర్. పీరియాడికల్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీ కోసం ఇండియన్ సినిమా మొత్తం ఎదురు చూస్తోంది. జక్కన్న ఎలాంటి మేజిక్స్ చేస్తాడో అని ఆసక్తిగా గమనిస్తోంది. దీంతో రాజమౌళి ఈ మూవీపై మరింత ఫోకస్ పెట్టాడు. తెలుగు వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ కథాంశాన్ని లార్జ్ స్కేల్ లో చూపించాలని స్కెచ్ గీస్తున్నాడు. 

 

భారీ సెట్లు, విజువల్ ఎఫెక్ట్స్ కు చాలా ప్రాధాన్యం ఉన్న ఈ సినిమాను విజువల్ ఫీస్ట్ లా ప్రజెంట్ చేస్తున్నాడు రాజమౌళి. అందుకే ఈ  సమ్మర్ కల్లా పూర్తి కావాల్సిన సినిమా ఇయర్ ఎండింగ్ కు వెళ్లిపోయింది. జులై 30న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 8న విడుదలవుతోంది. ఇక ఈ వాయిదాలతో నిర్మాత డి.వి.వి దానయ్య ఏమన్నా ఫీలవుతున్నాడో లేదో గానీ.. త్రివిక్రమ్ ఆలోచనలు మాత్రం మారాయనే టాక్ వచ్చింది. 

 

త్రివిక్రమ్ శ్రీనివాస్ ని సాహిత్యం మాత్రమే ప్రభావితం చేస్తుంది. వ్యక్తులు చాలా తక్కువగా అతన్ని ఇన్ ఫ్లుయెన్స్ చేస్తారని చెబుతారు. అలాంటి త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాను రాజమౌళి ప్రభావితం చేస్తున్నాడు. జక్కన్న పనికి జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా వాయిదా పడుతోందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: