సినిమాల్లో నటించాలి అంటే ఫిట్నెస్ చాలా అవసరం. ఎప్పటికప్పుడు శరీరాన్ని వారి అదుపులో ఉంచుకోవాలి నటులు. హీరోలు అయినా హీరోయిన్లు అయినా సరే ఇలాగే ఉంటారు. బాలీవుడ్ అయినా, హాలీవుడ్ అయినా ఇంకేది అయినా సరే సినిమాలు చెయ్యాలి అనుకున్న వాళ్ళు జిమ్ లో గంటలు గంటలు కష్టపడుతూ సినిమా కోసం సిద్దమవుతారు. ఫిట్ గా ఉన్నన్ని రోజులే అవకాశాలు వస్తాయి. తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అవకాశాలు రావడం అనేది చాలా కష్టం. ఈ విషయం తెలుసుకుంటే సినిమాలో రాణిస్తారు. 

 

అంత వరకు బాగానే ఉంది గాని ఈ మధ్య హీరోయిన్లు సోషల్ మీడియా లో ఎక్కవగా జిమ్ లో కష్టపడుతున్న ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్లు అయినా, కొత్త హీరోయిన్లు అయినా సరే ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. బాలీవుడ్ లో దీపిక పదుకొనే, దిశా పటాని, ఊర్వశి రౌతాలా, జాన్వీ కపూర్ ఇలా ఎవరు చూసినా సరే సోషల్ మీడియా లో ఫోటోలు పోస్ట్ చేసి హీట్ పెంచుతూ ఉంటారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. అభిమానులు కూడా వాటిని ఎక్కువగా షేర్ చేస్తారు. 

 

అసలు వాళ్ళు ఎందుకు అలా పోస్ట్ చేస్తారు అనేది ఒకసారి చూస్తే, తాము స్కిన్ షో కి రెడీ గా ఉన్నామని చెప్పడమే కాకుండా, తాము ఫిట్ గా ఉన్నాం, ఏ పాత్ర అయినా చేయడానికి రెడీ గా ఉన్నాం అని చెప్పడానికి అలాగే సోషల్ మీడియా లో ఫాలోయింగ్ ని పెంచుకోవడానికి ఇలా జిమ్ లో ఫోటో లు పోస్ట్ చేస్తున్నారట. వీటిని కూడా దర్శక నిర్మాతలు ఫాలో అవుతున్నారు. వాళ్లకు తగిన పాత్రలను ఎంపిక చేస్తున్నారు. అందుకే చాలా మంది బాలీవుడ్ హీరోయిన్ లు ఇలా సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసి కనపడని స్కిన్ షో చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: