మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత రెండు భారీ బ్లాక్ బస్టర్ విజయాలు వరుసగా కొట్టడం జరిగింది. సైరా సినిమా తో మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేయడం జరిగింది. చిరంజీవి కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సైరా చిరంజీవి కెరీర్ లోనే సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇటువంటి సమయంలో ఒక పక్క తన సినిమా గురించి పట్టించుకుంటూ మరో పక్క చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్ లైవ్ సినిమా కెరీర్ గురించి చిరంజీవి పడుతున్న కష్టం ఇండస్ట్రీలో ప్రస్తుతం పెద్ద హాట్ టాపిక్ అయింది.

 

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ కి సినిమాలు అంటే బాగా ఇష్టం అని అందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో చిరంజీవి నటించిన 'విజేత' సినిమా టైటిల్ తన ఫస్ట్ సినిమా టైటిల్ గా పెట్టుకొని సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. కానీ కళ్యాణ్ దేవ్ నటించిన ‘విజేత’ ప్రేక్షకులను సరిగా అలరించలేకపోయింది.ఈ ఈ నేపథ్యంలో కూతురు కోసం చిరంజీవి కళ్యాణ్ దేవ్ కెరియర్ కు సంబంధించి అన్నీ తానే దగ్గరుండి చూసుకుంటున్నారు. విషయంలోకి వెళితే కళ్యాణ్ ప్రస్తుతం పులి వాసు దర్శకత్వంలో సూపర్ మచ్చి అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రిజ్వాన్, ఖుషి నిర్మిస్తున్నారు.

 

సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ స్వరాలు కూర్చిన ఐదు పాటల్లో రెండు పాటలను ఇప్పటికే చిత్రీకరించారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కన్నడ భామ రచితా రామ్‌ నటిస్తున్నారు. అయితే రీసెంట్ గా ఈ సినిమా అవుట్ పుట్ ను చిరంజీవి పరిశీలించారట. అయితే అవుట్ పుట్ సరిగ్గా లేకపోవటంతో చిరంజీవి స్క్రీన్ ప్లే విషయంలో కొన్ని మార్పులు చేర్పులు డైరెక్టర్ కి తెలియజేసి పరుచూరి బ్రదర్స్ ని రంగంలోకి దింపడం జరిగింది. దీంతో ఈ తతంగం మొత్తం ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. దీంతో చాలామంది ఇండస్ట్రీలో ఉన్న సీనియర్స్ చిరంజీవి పడుతున్న ప్రతి తండ్రి కి గర్వకారణమని కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: