రాజా ది గ్రేట్ తర్వాత హిట్ కోసం నానా తిప్పలు పడుతున్నాడు మాస్ మహరాజ్ రవితేజ. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా తర్వాత టచ్ చేసి చూడు, నేల టికెట్టు, అమర్ అక్బర్ ఆంటోని సినిమాలు చేసిన రవితేజ ఆ సినిమాలన్ని వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ఇక రీసెంట్ గా వచ్చిన డిస్కో రాజా కూడా రవితేజ ఫేట్ మార్చలేకపోయింది. అందుకే తనకు డాన్ శీను, బలుపు లాంటి హిట్ ఇచ్చిన గోపిచంద్ మలినేని మీద నమ్మకం పెట్టుకున్నాడు రవితేజ. 

 

సాయి తేజ్ విన్నర్ తర్వాత అడ్రెస్ లేకుండా పోయిన గోపిచంద్ మలినేని రవితేజతో కలిసి చేస్తున్న సినిమా క్రాక్. ఈ సినిమా టైటిల్ తోనే షాక్ ఇవ్వగా ఫస్ట్ లుక్ పోస్టర్ అదరగొట్టింది. ఇక లేటెస్ట్ గా వచ్చిన ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. కరెక్ట్ సినిమా పడితే మాస్ మహరాజా సత్తా ఏంటో తెలుస్తుంది. చూస్తుంటే ఆ సినిమా క్రాక్ అనిపిస్తుంది. సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ గా కనిపిస్తున్న రవితేజ తన మార్క్ మేజరిజం కూడా చూపించినట్టు తెలుస్తుంది.

 

సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. గోపిచంద్ మలినేని కూడా ఈ సినిమాను చాలా కసితో చేస్తున్నాడు. రవితేజకు ఈ సినిమా అయినా హిట్ ఇస్తుందో లేదో చూడాలి. టీజర్ చూస్తే వావ్ అనిపించేలా ఉండగా ఇన్నాళ్లకు రవితేజ కరెక్ట్ ట్రాక్ లో పడ్డాడని అనిపిస్తుంది. మే మొదటివారంలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆడియెన్స్ కు సమ్మర్ ట్రీట్ ఇస్తుందో లేదో చూడాలి. టీజర్ చూసి మాస్ రాజా ఫాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. రవితేజ, శృతి హాసన్ హిట్ పెయిర్ ఈ సినిమాలో కూడా కలిసి నటించడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: