టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు యూత్ లో ఉన్న క్రేజ్ ఏంటో అందరీకీ తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమాతో అమ్మాయిలు, అబ్బాయిలు విజయ్ కి, ఆయన నటిస్తున్న సినిమాకి విపరీతంగా ఫ్యాన్స్ అయిపోయారు. ముద్దుగా ఆయన యాటిట్యూడ్ కి రౌడీ అన్న పేరును పెట్టి పోస్టర్స్ లో, బ్యానర్స్ లో వేసి నానా హంగామా చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు విజయ్ నటించిన సినిమాలలో హిట్స్ ఎన్ని ఉన్నాయో అంతకంటే దారుణమైన డిజాస్టర్స్ కూడా అన్ని ఉన్నాయి. వచ్చిన క్రేజ్ ని వచ్చినట్టే కిందకి లాగేసిన సినిమాలు నోటా, డియర్ కామ్రేడ్. అయినప్పటికి విజయ్ కి క్రేజ్ ఇప్పటికీ ఉన్నమాట వాస్తవమే. ఇక విజయ్ కొత్త సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్' కూడా డిజాస్టర్ అని ఫిక్సైపోయారు. ఈ సినిమా ఓపెనింగ్ కలెక్షన్లు 'డియర్ కామ్రేడ్' కంటే దారుణంగా ఉండడం ఫ్యాన్స్ ని మాత్రమే కాదు ఇండస్ట్రీ వర్గాలలోను ఆశ్చర్యాన్ని కలుగజేస్తున్నాయి.


 
దాంతో ఈ ఫ్లాపుల ప్రభావం ఇప్పటికే విజయ్ నెక్స్ట్ సినిమాలపై పడుతోందని టాక్ మొదలైంది. 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా డిజాస్టర్ కావడంతో ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో తెరకెక్కాల్సిన 'హీరో' ను మేకర్స్ క్యాన్సిల్ చేశారని తాజా సమాచారం. ఇప్పటికే ఈ సినిమా కొంత టాకీ పార్ట్ కూడా కంప్లీట్ చేసుకుంది.  అయితే 'వరల్డ్ ఫేమస్ లవర్' ఎఫెక్ట్ తో ఈ సినిమాను పూర్తిగా పక్కన పెట్టారట. కుదిరితే వేరే హీరో తో ఈ సినిమాని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే విజయ్ ప్రస్తుతం నటిస్తున్న 'లైగర్' పై కూడా ఈ సినిమా ఎఫెక్ట్ బాగా పడిందని తాజాగా వార్తలు వస్తున్నాయి.

 

పూరి జగన్నాధ్- విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా 'లైగర్'. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. హిందీ వెర్షన్ కు కరణ్ జోహార్ నిర్మాత. విజయ్ సినిమాలు వరసగా ఫ్లాపులు అవుతూ ఉండడంతో 'లైగర్' బడ్జెట్ విషయంలో కంట్రోల్ ఉండాలని పూరికి కరణ్ సూచించారట. ఇదంతా 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా ఎఫెక్టేనని అందుకే కరణ్ జోహార్ జడుస్తున్నాడని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: