మొదటి సినిమా అలా ఎలా ఎవరికి తెలియకపోయినా.. సుకుమార్ ప్రొడక్షన్ లో కుమారి 21f సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన భామ హెబ్భా పటేల్. రాజ్ తరుణ్ హీరోగా చేసిన ఆ సినిమా కమర్షియల్ గా కూడా సూపర్ హిట్ అయ్యింది. రత్నవేలు సినిమాటోగ్రఫీ, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అన్ని సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. ఓవిధంగా చెప్పాలంటే కుమారి హెబ్భాకు ఆ సినిమా కెరియర్ కు మంచి బూస్టప్ ఇచ్చింది. అయితే ఆ తర్వాత అమ్మడు సరైన నిర్ణయాలు తీసుకోలేక వెనుకపడిపోయింది.    

 

యువ హీరోల సినిమాల్లో సెకండ్ లీడ్ గా చేస్తూ వస్తున్న హెబ్భా పటేల్ ఈమధ్య ఆ ఛాన్సులు కూడా అందుకోవడం కష్టంగా మారింది. ఇక లేటెస్ట్ గా నితిన్ హీరోగా నటించిన భీష్మ సినిమాలో చాలా చిన్న పాత్ర చేసింది. అదికూడా డబ్బు కోసం ఓ బుద్ధవిగ్రహాన్ని పెళ్లి చేసుకునే పాత్రలో కనిపించి అక్కడ హీరో చెప్పిన మాటలకు ఫ్లాట్ అయ్యి అతనితో వస్తుంది. అయితే హీరో దగ్గర ఏమి లేదని తెలిసి మళ్లీ వెళ్లిపోతుంది. ఫస్ట్ హాఫ్ లో ఇలా కనిపించిన హెబ్భా సెకండ్ హాఫ్ చివర్లో ఓ హోటల్ రూం లో మంత్రితో కనిపిస్తుంది.  

 

అక్కడ హీరో కంటపడేసరికి తన రిసెప్షన్ లో మంత్రి కలిశాడని అప్పుడప్పుడు తనకోసం ఇలా వస్తానని అంటుంది. కుమారి సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హెబ్భా ఇలా ఎవరో ఒకరు చేయాల్సిన ఆ పాత్ర చేసింది అంటే ఆమె కెరియర్ పరంగా ఎంతగా దిగజారిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. భీష్మలో హెబ్భా సీక్రెట్ ఏంటో అని మనోళ్లో హడావిడి చేశారు తప్ప ఆమె చేసిన పాత్రకు గుర్తింపు కాదు కదా కనీసం ఆ పాత్ర ఎవరో ముక్కుమొహం తెలియని వారు చేసేది ఆమె చేసిందని చెప్పొచ్చు. సినిమాలు ఎలాగు వర్క్ అవుట్ కావడం లేదని వెబ్ సీరీస్ ల టర్న్ తీసుకున్న హెబ్భా ఇక మీదట అక్కడ చేసుకుంటే బెటర్ అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: