ప్రస్తుతం టాలీవుడ్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తొలి సారిగా కలిసి నటిస్తున్న భారీ మల్టీ స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యున్నత సాంకేతిక విలువలతో, భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి ఆలియాభట్, అలానే హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

 

ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త రెండు రోజులుగా పలు టాలీవుడ్ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది. అదేమిటంటే ముందుగా రాబోయే మార్చి 27 రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో ఆ రోజున ఆయన అల్లూరి లుక్ ని, అలానే మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో అదే రోజున కొమరం భీమ్ లుక్ ని రిలీజ్ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే వీటిలో ఏ మాత్రం నిజం లేదని కొందరు అంటున్నారు. 

 

ఇక వారు చెబుతున్న దాన్ని బట్టి, రాబోయే ఉగాది నాడు ఒకేసారి అల్లూరి, కొమరంభీమ్ ఇద్దరి అఫీషియల్ ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేయటానికి రాజమౌళి అండ్ టీం ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టిందని, ఇద్దరు హీరోల ఫస్ట్ లుక్ లు అదిరిపోయే రేంజ్ లో దాదాపుగా సిద్ధం చేయడం జరిగిందని అంటున్నారు. మరి వీరు చెప్తున్న వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ, ఒకవేళ ఇదే కనుక నిజమైతే అటు మెగా, ఇటు నందమూరి అభిమానులకు ఉగాది పండుగ అతి పెద్ద పండుగగా మారి, ఇద్దరు హీరోల అభిమానులకు విపరీతమైన ఆనందాన్ని అందించడం ఖాయం అనే చెప్పాలి...... !!

మరింత సమాచారం తెలుసుకోండి: