టాలీవుడ్ సినిమా పరిశ్రమకు మెగాస్టార్ తమ్ముడిగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్, ఆ తరువాత గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి సినిమాలతో మంచి సక్సెస్ లు అందుకుని అప్పటి యువతలో ఎంతో క్రేజ్ దక్కించుకున్నారు. ఇక మెగాస్టార్ తమ్ముడిగా కాకుండా తనకంటూ టాలీవుడ్ లో ఒకింత ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించిన పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ లోని కొందరు నటీనటుల్లో కూడా అభిమానులున్నారు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ వీరాభిమానుల్లో అందరికంటే ముందుగా ఉండే హీరో ఎవరయ్యా అంటే, అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు యంగ్ హీరో నితిన్. 

 

తన తొలి సినిమా జయం నుండి నేటి భీష్మ వరకు పలు సక్సెస్ఫుల్ సినిమాలతో పాటు మధ్యలో కొన్ని ఫ్లాప్స్ కూడా చవిచూసిన నితిన్, మొదటి నుండి పవన్ కళ్యాణ్ కు ఎంతో పెద్ద అభిమాని. ఇక తన పలు సినిమాల్లో పవన్ కళ్యాణ్ రెఫరెన్స్ ఉన్న సీన్స్ లో యాక్ట్ చేసిన నితిన్, అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ తాను పవన్ కు వీరాభిమానిని అని చెప్తూ ఉంటారు. 

 

ఇక ప్రస్తుతం ఆయన నటించిన భీష్మ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమాలోని ఒక సీన్ ని ఇమిటేట్ చేసిన నితిన్, ఇప్పుడు మాత్రమే కాదు ఎప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ని వదిలేది లేదని, ఒకప్పుడు అయితే పెద్దగా మీడియా ఫోకస్ లేకపోవడం వలన, నేను పవన్ గారి సినిమాల్లోని సీన్స్ ని అనుకరించిన విషయాలు అంతగా వెలుగులోకి రాలేదని, ఇక భీష్మ నుండి దాదాపుగా తన ప్రతి సినిమాలో కూడా చాలావరకు పవన్ కళ్యాణ్ సినిమాల్లోని ఏదో సీన్ ని కానీ, వీలైతే ఆయన నటించిన సినిమాల్లోని సక్సెస్ఫుల్ సాంగ్స్ లో కొన్ని సాంగ్స్ ని కానీ వాడుకుంటానని, పవన్ ఫై తనకున్న ప్రేమను ఈవిధంగా బయటపెడుతూనే ఉంటానని మొన్న భీష్మ సినిమా ప్రమోషన్ ఇంటర్వూస్ లో భాగంగా నితిన్ చెప్పడం జరిగింది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: