ఎస్.ఎస్.రాజమౌళి... జక్కన్న .. ఇవి బాహుబలి సినిమాకి ముందు ఆయనని పిలిచే పేర్లు. కానీ బాహుబలి సినిమా తర్వాత అందరూ దర్శక ధీరుడు అంటూ చెప్పుకుంటున్నారు. ఆయన స్టామినా, కెపాసిటీ అదీ మరి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలాంటి పేరు సంపాదించుకోగలిగారంటే ఆయనకి సినిమా మీద పిచ్చి ప్రేమ, తెగింపు ఎలాంటిదో అందరికీ తెలిసిందే. అయితే ఆయన సినిమాల నుండి ఏవో ఒక లీకులు బాహుబలి నుండి ఇబ్బంది పెడుతున్నవే. అయితే మెగా పవర్ స్టార్ రాం చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ వంటి ఇద్దరు టాప్ స్టార్ హీరోలతో తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. 

 

సినిమా నుంచి ఇప్పటివరకు ఎన్టీఆర్ కి సంబంధించినవే. దాంతో జక్కన్న చిత్ర యూనిట్ కి వార్నింగ్ కూడా ఇచ్చారు. కాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెటప్ కు సంబంధించి మాత్రం ఎలాంటి లీకులు కాలేదు. ఈ విషయంలో కొంతమంది అనవసరంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ కామెంట్స్ చేస్తున్నారట. ఈమధ్య ఎన్టీఆర్ కు సంబంధించి ఆర్ఆర్ఆర్ కీలక సన్నివేశం ఒకటి లీకైంది. పులి ఫైట్ కు సంబంధించిన సీన్ అని తెలియడంతో బాగా వైరల్ అయింది. అందులో ఎన్టీఆర్ చిరుతలా పరుగెత్తుతు కనిపించాడు. ఈ లుక్ కూడా బాగా వైరల్ అయింది. ఈ లీక్ వల్ల తారక్ కు భారీ పాపులారిటీ వచ్చేసింది. తారక్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోందో ఆయన ఫ్యాన్స్ అండ్ కామన్ ఆడియన్స్ ఒక అంచనాకి వచ్చేశారు.

 

దాంతో ఆర్ఆర్ఆర్ నుంచి రామ్ చరణ్ లుక్స్ కూడా లీక్ చేయమని కొంతమంది ఆర్.ఆర్.ఆర్ బృందానికి సూచిస్తున్నారట. అది చాలా చీప్ గా అనిపిస్తుంది. అయితే ఇదే చరణ్ వరకు వెళ్ళిందట. ఇలాంటి కామెంట్స్ కి చరణ్ చాలా సింపుల్ గా రియాక్ట్ అయ్యారట. ఎంతో కష్ఠపడి మేమంతా ఒక పెద్ద ప్రాజెక్ట్ ని మీ ముందుకు తీసుకురావాలని చూస్తున్నాము. కానీ ఎవరో సినిమాకి సంబంధించిన ఫోటోలని లీక్ చేసి క్రేజ్ ని దెబ్బతీస్తున్నారని ఫీలవుతున్నారట. అయినా అలా లీకుల తో వచ్చే చీప్ పబ్లిసిటి నాకవసరం లేదని ఇంకోసారి ఇలాంటి కామెంట్స్ పెట్టే వాళ్ళు కాస్త ఒళ్ళు దగ్గరపెట్టుకోవాలని సూచించారట. నిజమే కదా ఒక సినిమాకోసం సంవత్సరం పైగానే కష్టపడుతుంటే ఇలాంటి పనుల వల్ల తీవ్ర నష్టం జరిగే అవకాశమూ ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: