హ్యాకర్స్ దెబ్బకి జనాలు ఇప్పటికే చమటలు పట్టి చస్తున్నారు. బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ చేసి డబ్బు దోచేయడం, ఓ.టి.పి చెప్పమని క్రెడిట్ కార్డ్ లో పాతిక, ముప్పై వేల రూపాయలని కాజేయడం తరచూగా ఈ మధ్య జరుగుతోంది. ఇదొక్కటే కాదు సోషల్ మీడియాలో అంటే ఫేస్ బుక్, ఇన్స్టా గ్రాం, ట్విట్టర్ లలో పెట్టుకున్న ప్రైవేట్ ఫొటోలని, వీడియోలని కూడా డౌన్ లోడ్ చేసుకొని మార్ఫింగ్ చేసి బ్లాక్ మేయిల్ చేసి డబ్బు లాగడమో లేదా మానసికంగా, శారీరకంగా హింసించడమో చేస్తున్నారు. అదో రకమైన వ్యసనంగా మారిన ఇలాంటి పరమ చెత్త వెధవలు సొసైటీలో చాలామందే ఉన్నారు. వాళ్ళకి ఇదే వ్యాపకం తప్ప మరోటి ఉండదు.

 

అయితే ఇలాంటి సంఘటనలు ఎక్కువగా సినీ తారలకి ఎదురవుతుంటాయి. వాళ్ళ ఫొటో షూట్స్ పిక్చర్స్ ని దొంగిలించి వాటిని న్యూడ్ గా మర్ఫింగ్ చేసి నెట్ లో పెట్టేస్తున్నారు. ఒకప్పుడు ఇలా ఇంటర్ నెట్ లో సినిమా హీరోయిన్స్ ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్ కి సంబంధించిన ఫొటోలని మార్ఫింగ్ చేసి పెట్టిన సంగతి తెలిసిందే. దీని మీద పలువురు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చిన సందర్భాలున్నాయి. అయినా కూడా ఈ వెధవలకి ఇదే వ్యాపకం వ్యాపారం అయిపోయింది.

 

తాజాగా టాలీవుడ్, కోలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలంది తోను నటించిన స్టార్ హీరోయిన్ వీడియో ఒకటి దర్శనమిస్తూ బాగా వైరల్ అవుతోంది. ఆ హీరోయిన్ కుర్ర హీరోలతో పాటు సీనియర్ హీరోలతోను నటించింది. బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా తన ఖాతాలో ఉన్నాయి. అంతేకాదు టాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటుంది కూడా. ఇక రీసెంట్ గా ఆ హీరోయిన్ సినిమాలు కూడా వచ్చి సూపర్ హిట్ ని అందుకున్నాయి. అయితే తన కెరీర్ ని నాశనం చేసే ఉద్దేశ్యం తోనే ఈ రకమైన చర్యలకి పాల్పడినట్లు తెలుస్తోంది. మొత్తానికి పెద్ద స్టార్ హీరోయిన్ అన్న భయం లేకుండా ఇలా విడియోని క్రియోట్ చేసి నెట్ లో పెట్టడం అత్యంత దారుణం. 

మరింత సమాచారం తెలుసుకోండి: