స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల.. వైకుంఠపురములో ఈ సంక్రాంతికి విడుదలై యూనానిమస్ పాజిటివ్ టాక్ తో ఇండస్ట్రీ  హిట్ గా రికార్డు సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈచిత్రం ఇప్పటి వరకు 150కోట్ల షేర్ ను రాబట్టుకుందని సమాచారం. ఇక ఈ చిత్రం త్వరలో 50రోజుల థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకోనుంది అయితే అంత కన్నా ముందుగానే ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో అందుబాటులోకి రానుంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులు జెమిని టీవి దక్కించుకోగా డిజిటల్ హక్కులను సన్ నెక్స్ట్ సొంతం చేసుకుంది. టీవి ప్రీమియర్ కాకముందే ఈనెల 26నుండి సన్ నెక్స్ట్ లో అల స్ట్రీమింగ్ కానుంది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈచిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించగా థమన్ సంగీతం అందించాడు. అల్లు అరవింద్ ,రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 
 
ఇక ఈ సినిమా తరువాత అల్లు అర్జున్, సుకుమార్ డైరెక్షన్ లో నటించడానికి రెడీ అవుతున్నాడు.  ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో  తెరకెక్కనున్న ఈ చిత్రం ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం లో రష్మిక కథానాయికగా నటించనుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
 
ఇదిలాఉంటే అల తో ఇండస్ట్రీ హిట్ ను అందించిన త్రివిక్రమ్ తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ తో చేయనున్నాడు. అయినను పోయిరావలెను హస్తినకు అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ ,ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రం మే లో సెట్స్ మీదకు వెళ్లి  వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షకులముందుకు రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: