శ్రీరెడ్డి... ఈమె తెలియని వారు ఉండరు.. ఆలా అని ఈమె పెద్ద స్టార్ హీరోయిన్ ఏమి కాదు.. అలా అని కోటీశ్వరులు కాదు.. క్యాస్టింగ్ కౌచ్... పెద్ద స్టార్ల పరువును మీడియా ముందు పెట్టి ఫేమస్ అయినా క్యాస్టింగ్ కౌచ్ శ్రీ రెడ్డి. అలా ఫేమస్ అయ్యిందో లేదో.. ఇలా ఆమె సోషల్ మీడియాలో హాల్ చల్ చేసేస్తోంది. 

 

ఏ స్టార్ హీరో అయినా... ఏ రాజకీయ నాయకుడు అయినా సరే ఈమె నోట్లో పడ్డారు అంటే ఒక నెల రోజులు ప్రజలకు కనిపించరు. అలా మాట్లాడుతుంది శ్రీ రెడ్డి. ఇకపోతే ఈ శ్రీ రెడ్డి మాట్లాడే ప్రతి మాటా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాంటి మాటలు మాట్లాడుతుంది శ్రీ రెడ్డి. 

 

అలానే ఓ సీనియర్ నటిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అందరి మీద చేస్తున్నట్టే ఆమె మీద చేసింది. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక అంతే ఆ నటి వెళ్లి పోలీసులను ఆశ్రయించింది. నాపై శ్రీ రెడ్డి చెత్త వాగుడు వాగింది.. యాక్షన్ తీసుకోండి అని. ఇక ఆ తర్వాత కూడా కొందరు ఆమెపై పోలీస్ కేసులు పెట్టారు. 

 

అయితే ఇంత వరుకు అలా కేసులు పెట్టినట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి కానీ ఆమెపై ఏటువంటి యాక్షన్ తీసుకోలేదు. కేసు నమోదు చేసిన యాక్షన్ తీసుకోడానికి ముహూర్తం చూస్తున్నారు అని అంటున్నారు కొందరు నెటిజన్లు. అయితే శ్రీ రెడ్డి కొత్తగా .. వైరాల్ అవ్వాలి అనుకుందో ఏమో తెలియదు.. 

 

నిన్న మహాశివరాత్రి సందర్భంగా ఆమె అఘోరాగా వేషం వేసింది. ఆ వేషం చూసి ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.. అక్క నీకు ఏమైంది అంటూ కామెంట్లు పెట్టేరు.. మరికొందరు అయితే.. కేసుల భయంతో.. పిచ్చి పట్టి అఘోరాగా మారిపోయింది రోయ్.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా శ్రీ రెడ్డి అఘోరా వేషం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: