రవితేజ.. ఎంతో కష్టపడి స్వయం కృషితో ఎదిగిన హీరోలలో ఇతను ఒకడు. ఎంతో మంచి నటుడు.. అద్భుత నటుడు. అప్పట్లో ఈయన సినిమాలు అంటే అభిమానులలో ఓ రకమైన ఊపు వచ్చేది. అలాంటి సినిమాలు తీశాడు ఈ ఇడియట్. అప్పట్లో పూరి జగన్నాథ్ తో ఇడియట్ సినిమా.. రాజమౌళితో విక్రమార్కుడు సినిమా ఇప్పుడు చూసి మళ్ళి మళ్ళి చూడాలి అనిపిస్తాయి.       

 

ఆ సినిమాలు అంత అద్భుతంగా ఉంటాయి మరి.. విక్రమార్కుడు అయినా రవితేజ దరువుని చూస్తే ఈ ప్రేక్షకుడు అయినా ఎగరాల్సిందే.. షాక్ సినిమాతో ప్రేమికులకు దగ్గర అయినా మాస్ మహా రాజ్ రవితేజకు గత కొద్దీ కాలం నుండి సరైన హిట్ లేదు.. మొన్న వచ్చిన డిస్కో రాజాతో ఖచ్చితంగా హిట్ కొడుతాడు అనుకుంటే అది కూడా గాల్లోకి కలిసిపోయింది.     

 

అందుకే ఈసారి ఎలా అయినా సరే రవి తేజ హిట్ కొట్టాలి అనుకున్నాడు. అలానే సినిమాను తీస్తున్నాడు. ఆ సినిమా టీజర్ చూస్తే ఎవరైనా సరే.. వావ్ అద్భుతం అని అనాల్సిందే. అలా ఉంది నిన్న విడుదల అయినా క్రాక్ టీజర్. అయితే హిట్ కోసం అని రవి తేజ ఎంతకైనా తెగించేస్తాడు అని ఈ సినిమా చూస్తేనే తెలుస్తుంది. 

 

సినిమా టీజర్ లో ఓ నటి కాలు రవి తేజ ముఖాన్ని తాకింది.. దీంతో ఈ టీజర్ చుసిన అభిమానులు.. అన్న నీకు హిట్ ఇస్తాం.. ఎవరో కాళ్ళు నీ మొఖంపై వేయించుకోకు అన్న ప్లీజ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు మాస్ మహా రాజ్ అభిమానులు. ఏది ఏమైనా రవితేజ ఇలా హిట్ కోసం అని ఇలాంటి సీన్లు తియ్యకపోతే అభిమానులు కాస్త ఆనందపడుతారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: