సినిమా వాళ్ళ‌కు సెంటిమెంట్లు ఎక్కువ‌న్న విష‌యం తెలిసిందే. వారు ప్ర‌తి విష‌యంలోనూ ఎంతో సెంటిమెంట్‌గా వెళుతూ వారు అనుకున్న‌దానికి ఏమాత్రం సెంటిమెంట్ అడ్డువ‌చ్చినా దాన్ని వెంట‌నే మార్చాల‌ని చూస్తారు. అలాంటి దాని గురించి తెలుసుకుందాం. సినిమా వాళ్ళ పేర్ల‌కు పబ్లిక్‌లో ప‌బ్లిసిటీనే వేరు. అందుకే వారు పుట్టిన‌ప్పుడు వారి త‌ల్లిదండ్రులు ఏం పేరు పెట్టినా కూడా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాక మాత్రం పేరు మార్చుకుంటారు. ఇక కొంత మంది అయితే మాత్రం జ్యోతిష్యం ద్వారా తాము ఏ పేరును సంపాదించ‌వ‌చ్చో అదే పేరును ఎంచుకుంటారు. కార‌ణం ఏమైనప్ప‌టికీ మ‌న టాలీవుడ్‌లో స్టార్ డ‌మ్ సంపాదించిన అనేక మంది హీరోయిన్ల‌కి అస‌లు పేర్లు వేరే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

 

స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ అస‌లు పేరు సుజాత‌. పుట్టింది మ‌ద్రాస్‌లో ఆమె సినిమాల్లోకి అడుగుపెట్టే స‌మ‌యానికి మ‌రో సుజాత ఉండ‌డంతో పేరు మార్చుకోవ‌ల‌సివ‌చ్చింది. జ‌య‌ప్ర‌ద అస‌లు పేరు ల‌లితా రాణి. రాజ‌మండ్రిలో జ‌న్మంచిన ఈమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప‌రిచ‌య‌మై ద‌క్షిణాది బాలీవుడ్‌లో అగ్ర క‌థానాయిక‌గా ఎదిగి ఆ త‌ర్వాత రాజ‌కియాల్లో స్థిర‌ప‌డిపోయింది.  శ్రీ‌దేవి అతిలోక‌సుంద‌రి అస‌లు పేరు చాలా పొడ‌వు. శ్రీఅమ్మ అయ్యంగార్ అయ్య‌ప్ప‌న్‌. పుట్టింది త‌మిళ‌నాట అయినా సెటిల్ అయింది మాత్రం ముంబ‌యిలో. ఈమె అగ్ర‌హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించింది. దాదాపుగా రెండు ద‌శాబ్దాల హీరోల‌తో న‌టించి స్టార్ స్టేట‌స్ సంపాదించింది. దాదాపు హీరోయిన్లు రెండు ద‌శాబ్దాల హీరోల‌తో న‌టించ‌డం అంటే మాములు విష‌యం కాద‌నే చెప్పాలి. ఈమె కూడా చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 

 

సౌంద‌ర్య తెలుగు సినిమా ఉన్నంత కాలం సౌంద‌ర్య అన్న పేరుకు చావు లేదు. భౌతికంగా మ‌న‌ల్ని విడిచి పెట్టి వెళ్ళినా ఈ మ‌హాన‌టి అస‌లు పేరు సౌమ్య. పుట్టింది క‌ర్నాట‌క‌లో రోజా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కియాల్లో సంచ‌ల‌నాత్మ‌క పేరుగా మారిన రోజా అస‌లు పేరు శ్రీ‌ల‌తారెడ్డి. సినిమాల కోసం రోజాగా మారింది. రంభ గ్లామ‌ర్ అన్న ప‌దం విన‌గానే 1990లో ముందు గుర్తొచ్చే పేరు రంభ‌. అస‌లు పేరు విజ‌య‌ల‌క్ష్మి పుట్టింది విజ‌య‌వాడ‌లో. రాశి ఇటు గ్లామ‌ర్ రోల్స్ అటు వైవిధ్య‌మైన న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. రాశి అస‌లు పేరు  మంత్ర‌. ఇప్పుడు కూడా చాలా మంది ఆమెను ఈ పేరుతో పిలుస్తారు. అనుష్క క‌ర్నాట‌క నుంచి వ‌చ్చి తెలుగులో సౌత్‌లో మంచి పేరు తెచ్చ‌కుంది. ఈ బొమ్మాళి అస‌లు పేరు స్వీటీశెట్టి. సినిమాల్లో తప్పించి బ‌య‌ట అంద‌రూ స్వీటీ అనే పిలుస్తారు. న‌య‌న‌తార కేర‌ళందం న‌య‌న‌తార అస‌లు పేరు డ‌యానా మ‌రియ‌న్ కొరియ‌న్‌. కాని ఈ లేడీ సూప‌ర్‌స్టార్ గ్లామ‌ర్ ప్ర‌పంచానికి రాగానే న‌య‌న‌తార‌గా పేరు మార్చుకుంది. భూమిక దేశ‌రాజధాని ఢిల్లీ నుంచి వ‌చ్చిన ర‌చ‌నాచావ్లా కాస్త భూమిక‌గా  మారి తెలుగులో మంచి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల్లో న‌టించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: