పోతినేని రామ్.. అసలు ఈ క్యూట్ బాయ్ ని చూస్తే ఎవరైనా సరే పడిపోవాల్సిందే.. అలా ఉంటాడు రామ్. అయితే ఇన్నాళ్లు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉన్న ఈ రామ్ ఇప్పుడు మాస్ హీరోగా పేరు తెచ్చుకునే పనిలో పడ్డాడు.. ఇటీవలే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ శంకర్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఫుల్ జోష్ లో ఉన్న హీరో రామ్ ఇప్పుడు రెడ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. 

 

ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు.. అలాంటి ఈ సినిమాలో రామ్ సరసన నివేద పేతురాజుఎం మాళవిక శర్మ, అమృత అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.. అయితే ఈ సినిమాను స్రవంతి రవికిశోర్ శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 9న విడుదల చెయ్యనున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.     

 

అయితే ఈ సినిమాకు సంబంధించి రెండు పాటలను ఇటలీలో చిత్రీకరించారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించి ఓ ఫోటో విడుదల అయ్యింది.. ఆ ఫోటో చూసి అభిమానులు అంత కూడా వావ్ అంటున్నారు.. అయితే ఆ ఫోటో రెడ్ సినిమాలో భాగం అని వారికీ తెలియక.. రామ్ ప్రేమలో పడ్డాడా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

అయితే ఇప్పటికే రామ్ వయసు ఉన్న నితిన్.. నిఖిల్ కు పెళ్లి సెట్ అయ్యి.. ఎంగేజ్ మెంట్ కూడా అవ్వగా.. రామ్ మాత్రం ఇంతవరుకు పెళ్లికి సంబందించిన వార్తే బయటకు రావట్లేదు.. దీంతో అభిమానులు అంత కూడా నువ్వు పెళ్లి ఎప్పుడైనా చేసుకో నువ్ ప్రేమించిన అమ్మాయి ఎవరో చెప్పు అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి రామ్ ప్రేమించిన అమ్మాయిని అయన అభిమానులకు ఎప్పుడు పరిచయం చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: