స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రం ఇద్దరు కలిసి చేసిన మ్యాజిక్ అల వైకుంఠపురములో. చాలా సింపుల్ కథను తన టాలెంట్ తో తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ ఆడియెన్స్ ను మెప్పించేలా చేశాడు త్రివిక్రం. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్దె నటించిన ఈ సినిమాకు థమన్ అందించిన మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా హిట్ లో సగ భాగం మ్యూజిక్ కు ఇచ్చేయొచ్చు. ఇదిలాఉంటే ఈ సినిమా ఒరిజినల్ ప్రింట్ కోసం ఆడియెన్స్ వెయిట్ చేస్తున్నారు. 

 

సన్ నెక్స్ట్ అల వైకుంఠపురములో సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది. మాములుగా తెలుగులో స్టార్ సినిమాలన్ని అమేజాన్ ప్రైం కు ఇచ్చేస్తున్నారు. కాని బన్ని మాత్రం అమేజాన్, నెటి ఫ్లిక్స్ లకు కాకుండా సన్ నెక్స్ట్ వారికి ఇచ్చారు. ఈ నెల 26 నుండి అల వైకుంఠపురములో సినిమా సన్ నెక్స్ట్ లో అందుబాటులో ఉంటుంది. సినిమా రిలీజైన 50 రోజుల తర్వాత డిజిటల్ ప్లాట్ ఫాం లో రిలీజ్ చేసుకోవచ్చు. ఆ అగ్రిమెంట్ బేస్ మీదనే ఫిబ్రవరి 26న అల వైకుంఠపురములో సినిమా డిజిటల్ స్క్రీన్ మీద రానుంది.

 

ఇప్పటి వరకు 160 కోట్ల షే రాబట్టిన ఈ సినిమా ఇంకా వసూళ్లను సాధిస్తూనే ఉంది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత బన్ని, త్రివిక్రం ఇద్దరు కలిసి చేసిన ఈ సినిమా ఈ రేంజ్ లో సక్సె అవడం అల్లు, మెగా ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేసింది. ఈ సినిమాలో టబు, సుశాంత్, నివేదా పేతురాజ్ వంటి స్టార్స్ కూడా నటించారు. హారిక హాసిని బ్యానర్ తో పాటుగా గీతా ఆర్ట్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యింది.


 

మరింత సమాచారం తెలుసుకోండి: