అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ ఏ స్థాయిలో పాపులర్ అయ్యాడో అందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా ఈ సినిమాలో విజయ్ నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ సినిమా వివాదాల గురించి కూడా అందరికి తెలిసిందే. ప్రధానంగా సినిమాలో విజయ్ మాట్లాడిన మాటలు, సినిమా పోస్టర్ల చుట్టూనే వివాదాలు నడిచాయి. ప్రతీ సీన్ కూడా ఏదోక వివాదం తోనే ఉందీ అంటూ పలువురు ఆరోపణలు కూడా చేసారు. చివరికి రాజకీయ పార్టీలు కూడా ఈ విషయంలో విజయ్ పై విమర్శలు చేసాయి. 

 

ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలకు ముందు ఒక ప్రచారం ఎక్కువగా జరిగింది. విజయ్ దేవరకొండ తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ బంధువు అంటూ ప్రచారం జరిగింది. కాంగ్రెస్ నేత వీహెచ్ కూడా దీనిపై విమర్శలు చేసారు. అప్పట్లో ఇది ఒక సంచలన వార్త అయింది కూడా. అసలు నిజంగా విజయ్ కి కెసిఆర్ మధ్య బంధుత్వం ఉందా...? దీనిపై విజయ్ నే స్వయంగా స్పందించాడు. తమకు బంధుత్వం ఉంది గాని అది దూరపు బంధుత్వం అన్నాడు. దానికి కారణం ఏంటీ అనేది కూడా వివరించాడు. 

 

తమది చాలా చిన్న సామాజిక వర్గం అని కాబట్టి ఆ కులంలో తమకు బంధువులు ఎక్కువగా ఉంటారని, ఎక్కడో ఒక చోట ఏదోక లింక్ ఉంటుంది అన్నారు. ఇక అప్పటి నుంచి తెరాస కార్యకర్తలు కూడా విజయ్ ని తెలంగాణా హీరో అన్నారు. సూపర్ స్టార్ ని చేసారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయి విడుదలకు సిద్దంగా ఉంది. వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకి వస్తుంది. తాజాగా విజయ్ నటించిన సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ ఫ్లాప్ అయింది. భారీ అంచనాలతో వచ్చి ఫ్లాప్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: