ఏ హీరోలకు.. ఎవరికి.. ఎందుకు మీకు డౌట్ వచ్చింది అని అందరూ అనుకోవచ్చు.. కానీ ఎం చేస్తాం.. ఈ హీరోలు అసలు ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా కనిపించడం లేదు మరి.. అందుకే ఈ హీరోలకు ఇప్పట్లో పెళ్లి అవుతుందా? అసలు అనే సందేహం వస్తుంది. ముసలోళ్లు అవుతున్నారు కానీ పెళ్లి మాత్రం చేసుకోవడం లేదు ఈ హీరోలు. అలాంటి హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.. 

 

ఇన్నాళ్లు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ లో ఉన్న నితిన్.. నిఖిల్ సిద్దార్థ ఎంగేజ్మెంట్ చేసుకొని ఈ డౌట్ నుండి తప్పించుకున్నారు. కానీ కొందరు హీరోలు మాత్రం ఆ డౌట్ ను ఇంకా ఇంకా పెంచేశారు. అలా పెంచినవారిలో మొదటి స్థానంలో ఉన్న హీరో ఎవరు అంటే అది ఖచ్చితంగా ప్రభాస్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రభాస్ 40 ఏళ్ళు వచ్చింది. కానీ ఇప్పటికి పెళ్లి అంటే ఇంకో సంవత్సరం అని మాట దాటేస్తాడు. 

 

ఇంకా ప్రభాస్ తర్వాత రానా.. ఈయనుకు ఇప్పటికే ఆపరేషన్లు అయ్యాయి కానీ పెళ్లి కాలేదు.. ఇతని కంటే చిన్నవాళ్లు కూడా పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అయ్యారు కానీ రానా మాత్రం ఇంకా చేసుకోలేదు.. నెక్స్ట్ శర్వానంద్ కూడా అంతే. ఇతనికి కూడా 35 ఏళ్ళు.. పెళ్లి మాట ఎత్తితే చాలు ప్రభాస్ అన్న పెళ్లి అయ్యాక నా పెళ్లి అని అంటాడు. అంటే ప్రభాస్ పెళ్లి ఇప్పట్లో అవ్వదు అని ఫిక్స్ అయ్యాడు ఏమో.. 

 

వీళ్ళను పక్కన పెడితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయినా నవదీప్ అసలు పెళ్లి చేసుకుంటాడా? అనే సందేహం వస్తుంది. ఎందుకంటే? ఎవరైనా పెళ్లి గురించి అడిగితే చాలు టాపిక్ మారుస్తాడు. సందీప్ కిషన్ కూడా అంతే.. ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉన్న ఇప్పటికి పెళ్లి చేసుకోలేదు... ఇతని తర్వాత రామ్ పోతినేని అంతే.. మాస హీరో ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నంలో పెళ్లి చేసుకోవాలి అనే విషయాన్నీ మర్చిపోయాడు. 

 

ఇంకా కొణిదెల వారసుడు వరుణ్ తేజ్ కి పెద్ద వయసు లేదు.. కానీ పెళ్లి చేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. ఇంకా పెళ్లి చేసుకోవాల్సిన వరుసలో సాయి ధరమ్ తేజ్.. అల్లు శిరీష్. బెల్లం కొండా శ్రీనివాస్.. అడివి శేష్.. నారా రోహిత్.. సుశాంత్.. రాజ్ తరుణ్.. కూడా వరుసలో ఉన్నారు. మరి వీళ్ళు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో చూడాలి..   

మరింత సమాచారం తెలుసుకోండి: