ఎన్నో సినిమాలు చేస్తే గాని రాని క్రేజ్ కేవలం ఒక్క సినిమాతో వస్తే.. సినిమా కూడా కాదు సినిమా టీజర్ తో సోషల్ మీడియాని స్థంభింపచేసి తన పేరు జపించేలా చేసిన వింక్ బ్యూటీ ప్రియా ప్రకాశ్. ఆమె కన్ను గీటిన ఆ ఒరు ఆదార్ లవ్ టీజర్ చూడని వారుండరంటే నమ్మాల్సిందే. కన్ను గీటి కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టిన ఈ అమ్మడు ఇప్పుడు మరోసారి తన టాలెంట్ తో ఆడియెన్స్ ను అలరిస్తుంది. 

 

ప్రియా ప్రకాశ్ లేటెస్ట్ వీడియోలో తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కు ముద్దులను గాల్లో వదులుతూ ఓ వీడియో చేసింది ప్రియా ప్రకాశ్. వాలెంటైన్స్ డే సందర్భంగా చేసిన ఈ వీడియో ఇప్పటికి సోషల్ మీడియాలో అందరి కంట పడ్డది. ఒరు ఆదర్ లవ్ టీజర్ తో సెన్సేషనల్ అయిన ప్రియా ప్రకాశ్ అదే సినిమా తెలుగులో లవర్స్ డేగా రిలీజ్ చేశారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం తెలుగులో నితిన్ సరసన ఓ సినిమా చేస్తున్న ప్రియా ప్రకాశ్ తెలుగులో వచ్చిన యువ హీరోల అవకాశాలు వద్దని చెబుతుంది.

 

విజయ్ దేవరకొండ అంటే తనకు చాలా ఇష్టమని ఓపెన్ గా చెప్పేస్తున్న ఈ అమ్మడు అతనితో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ప్రియా ప్రకాశ్ లేటెస్ట్ హాట్ లుక్ కుర్రాళ్లను మళ్లీ డిస్ట్రబ్ చేస్తుంది. యువతను చెడగొట్టడమే తన ముఖ్య ఉద్దేశం అన్నట్టుగా ప్రియా ప్రకాశ్ గట్టిగా ఫిక్స్ అయినట్టు ఉంది. అందుకే అమ్మడు ఇలా తన సోషల్ బ్లాగ్ లో రెచ్చిపోతుంది. మరి ఈ యాక్టివిటీస్ కన్నా సినిమాల మీద ఎక్కువ దృష్టి పెడితే బెటర్ అని ఆమెకు కొందరు సలహాలిస్తున్నారు. తెలుగులో తనకు ఉన్న ఫాలోయింగ్ కు మంచి బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది ప్రియా ప్రకాష్.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by priya Prakash Varrier💫 (@priya.p.varrier) on


 

మరింత సమాచారం తెలుసుకోండి: