సినిమాల పరిస్థితి రాను రాను మరీ ఘోరంగా తయారవుతోంది. ఎలాంటి సినిమాలు తీయాలో కూడా తెలీకుండా బుద్ధి లేని పనులు చేస్తూ కొత్త జానర్ అంటూ కబుర్లు చెబుతున్నారు. మన టాలీవుడ్ కంటే అత్యంత దారుణం బాలీవుడ్. మగాళ్ళ మధ్య సెక్స్ అన్న కాన్సెప్ట్ తో సినిమాలు తీస్తున్నారు. వైవిధ్యానికి కేరాఫ్ గా మారిన బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా సినిమాల పరంగా తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకుని సత్తా చాటుతున్నాడు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం ట్యాలెంట్.. మైండ్ గేమ్ తో బాలీవుడ్ లో నెగ్గుకొస్తు గట్టి పోటీ ఇస్తున్నాడు. వారసత్వ తారల డామినేషన్ రాజ్యమేలే చోట ఇలాంటి కొత్త ఆలోచనలు ఉన్న కుర్రాళ్లను ఆపగలిగే శక్తి ఏదీ లేదని ప్రూవ్ చేశాడు. కేవలం ఆయుష్మాన్ కథల ఎంపిక విషయంలోనే సెన్సేషన్ క్రియోట్ చేశాడు. ఇదివరకూ వీర్యదానం కాన్సెప్ట్ .. బట్ట తల కథ.. అమ్మాయిగా ఏడిపించే అబ్బాయి కథల్లో నటించాడు. ప్రయోగాలెన్నో చేసి బ్లాక్ బస్టర్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

 

అందుకే ఆయుష్మాన్ నుంచి ఓ సినిమా వస్తోంది అంటే అందరిలో ఆసక్తి విపరీతంగా ఉంటుంది. తాజాగా స్వలింగ సంపర్కం నేపథ్యంలో మరో ప్రయోగాత్మక సినిమాతో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్' అనేది టైటిల్. అయితే ఈ సినిమా రిలీజ్ ముంగిట అతడికి రకరకాలుగా చిక్కుల్ని తెస్తూనే ఉంది. స్వలింగ సంపర్కం కథాంశంపై అభ్యంతరం చెబుతూ రెండు దేశాలు రిలీజ్ ని అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది. భారత్ లోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు యువకుల మధ్య ప్రేమ కథను తెరపై చూపారు.

 

సెక్సువల్ కంటెంట్ కాన్సెప్ట్ కావడంతో ఈ సినిమాని సనాతన ఆచారాలను పాటించే దుబాయ్- యూఏఈలో నిషేధించారు. ఇందులో అటువంటి సన్నివేశాల్ని తొలగించామని చిత్రబృందం చెబుతున్నా ఆయా దేశాల్లో నిషేధించడం వివాదాస్పదం అయ్యింది. గజ్ రాజ్ రావు- నీనా గుప్తా తదితరులు ఇందులో నటించారు. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా- జితేంద్ర మధ్య ముద్దు సీన్లను తొలగిస్తామని చెప్పినా అందుకు అభ్యంతరం వ్యక్తమైంది. ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా రిలీజవుతుందా లేదా .. అన్నది అనుమానమే. అంతేకాదు అసలు ఇద్దరు మగాళ్ళు సెక్స్ ఎలా చేస్తారు చూపిండ్రా అంటూ నానా బూతులు తిడుతున్నారట. మరి ఎవరిని ఉద్దరించడానికి ఇలాంటి కథలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: