రాజకీయాల్లో వైఎస్ కుటుంబం, సినిమాల్లో మంచు కుటుంబం. ఎవరి రంగాల్లో వాళ్ళు ఎవరికి అందని ఎత్తులో ఉన్నారు. వైఎస్ కుటుంబం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాశించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ప్రజాకర్షక పథకాలతో మహానేత అయ్యారు. 2004 నుంచి 2009 వరకు ఆయన తీసుకున్న ఎన్నో నిర్ణయాలతో ప్రజల్లో మహానేతగా ఎదిగారు. కడప ఎంపీగా, ఎమ్మెల్యే గా, మంత్రిగా ఆయన రాజకీయంగా ఎన్నో విజయాలు సాధించారు. 

 

ఇక ఆ తర్వాత వైఎస్ వివేకా కూడా రాజకీయాల్లో రాణించారు. కడప ఎంపీగా, మంత్రిగా సేవలు అందించారు. ఇప్పుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. మంచు కుటుంబం విషయానికి వస్తే... సాదా సీదా నటుడు నుంచి టాలీవుడ్ ని శాశించే స్థాయికి వెళ్ళారు మోహన్ బాబు. విలక్షణ నటుడిగా మోహన్ బాబు నటనకు ఎందరో అభిమానులు ఉన్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన మోహన్ బాబు ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. 

 

ఇదిలా ఉంటే మంచు, వైఎస్ కుటుంబాల మధ్య బంధుత్వం ఏర్పడింది. మోహన్ బాబు కి, వైఎస్ఆర్ వియ్యంకుడు అయ్యారు. ఎలా అంటే మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు, విరోనికని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వైఎస్‌ కుటుంబానికి చెందని ఆడబిడ్డే విరోనిక. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండో తమ్ముడు సుధీర్ రెడ్డి కూతురు విరోనిక. జగన్, విరోనికలు అన్నదమ్ముల బిడ్డలు కావడంతో సిఎం  జగన్‌ కి చెల్లి అవుతుంది విరోనిక. మంచు విష్ణు విరోనిక ను ప్రేమ వివాహం చేసుకోవడంతో వైఎస్ కుటుంబంతో బంధుత్వం ఏర్పడింది. ఇక అప్పటి నుంచి ఈ రెండు కుటుంబాలు అత్యంత సన్నిహితంగా ఉంటాయి. అదే విధంగా చంద్రబాబు కుటుంబం తో కూడా మోహన్ బాబు కుటుంబానికి బంధుత్వం ఉన్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: