సినిమా నటుల మధ్య కానీ, రాజకీయ నాయకుల మధ్య కొన్ని ప్రజలకు తెలీని బంధుత్వాలు ఉంటాయి. వాటి గురించి తెలిసినప్పుడు చాలా ఆసక్తి రేకెత్తిస్తాయి. ఎందుకంటే ఆయా రంగాలపట్ల ఉన్న ఆకర్షణ కారణంగా వాటి గురించి తెలిసినప్పుడు ఇంటరెస్ట్ గా ఉంటాయి. సినీ పరిశ్రమను రెండు విభాగాల్లో ఏలిన ఇద్దరు ఉద్దండులు దూరపు బంధువులు అవుతారంటే.. చాలా అసక్తి రేకెత్తిస్తుంది. దర్శకత్వ విభాగంలో రారాజుగా వెలిగిన దర్శకరత్న దాసరి నారాయణ రావు, హీరోయిజానికి కేరాఫ్ అడ్రస్, ఔత్సాహికులకు ఆదర్శంగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి.. వీరిద్దరికీ బంధుత్వం ఉంది.

 

 

మెగాస్టార్ చిరంజీవికి దాసరి నారాయణరావు వరుసకు తాత అవుతారు. వారిద్దరి మధ్య బంధుత్వం ఉంది. బంధువుల లెక్కలో చూసుకుంటే దూరపు బంధువుగా వీరిద్దరిదీ తాతా – మనవళ్ల బంధం. ఈ విషయాన్ని చిరంజీవే ఓసారి తన ఇంటర్యూలో చెప్పుకొచ్చారు. చిరంజీవి సినిమాల్లోకి వచ్చేనాటికే దాసరి అగ్ర దర్శకుడు. కానీ వీరిద్దరికీ అప్పటికే బంధుత్వం ఉందా.. లేదా అనే విషయం ఎప్పుడూ రివీల్ కాలేదు. అల్లు రామలింగయ్య తరపు నుంచి కానీ.. చిరంజీవి తరపు నుంచి కానీ తర్వాత కాలంలో వీరిమధ్య బంధుత్వం ఏర్పడి ఉంటుంది అనే ఊహాగానాలు ఉన్నాయి. తన సినిమా వంద రోజుల ఫంక్షన్ ఎప్పుడు జరిగినా దాసరిని చీఫ్ గెస్ట్ గా పిలిచి గౌరవించే వారు చిరంజీవి.

 

 

అయితే.. రాజకీయంగా వీరిద్దరి మధ్యా కొంత గ్యాప్ తీసుకొచ్చింది. సినిమాల పరంగా కూడా కొన్ని వివాదాలు నడిచాయి. కొన్నేళ్ల తర్వాత విబేధాలన్నీ సమసిపోయాయి. దాసరిపై ప్రముఖ సినీ జర్నలిస్టు పుసుపులేటి రామారావు రాసిన పుస్తకాన్ని చిరంజీవి ఆవిష్కరించారు. చిరంజీవి 150వ సినిమా విజయంపై దాసరి సంతోషం వ్యక్తం చేశారు. వీరిద్దరూ కలిసి హిట్లర్ సినిమాలో కలిసి నటించారు. దాసరి తన 100వ సినిమాను చిరంజీవితోనే లంకేశ్వరుడు గా తెరకెక్కించారు

మరింత సమాచారం తెలుసుకోండి: