తెలుగు ఇండస్ట్రీలో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ‘పెళ్లిచూపులు’ చిత్రంతో హిట్ అయ్యింది.  ఆ తర్వాత సందీప్ వంగా దర్శకత్వంలో ‘అర్జున్ రెడ్డి’ తో సెన్సేషన్ హిట్ అందుకున్నాడు.  దాంతో విజయ్ దేవరకొండకు తెలుగు ఇండస్ట్రీలో యూత్ ఐకాన్ గా మారాడు.  ఇక పరుశరామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన ‘గీతా గోవిందం’ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు.  ఈ చిత్రం తర్వాత టాక్సీవాలా హర్రర్ కాన్సెప్ట్ తో మరోసారి ప్రేక్షకుల మనసు దోచాడు.    ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ నలుగురు హీరోయిన్లతో ఈ మద్య వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంతో తో వచ్చాడు.  అయితే ఈ మూవీ గతంలో అర్జున్ రెడ్డి లా మరోసారి అగ్రెసీవ్ గా కనిపించాడని విమర్శలు వచ్చాయి.

 


ఈ చిత్రం తొలి రోజు నుండే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో కలెక్షన్స్ కూడా వీక్ గానే వచ్చాయి. తొలి రోజు విజయ్ దేవరకొండ క్రేజ్ వల్ల ఈ చిత్రానికి 4 కోట్ల పైన షేర్ వచ్చింది. ఇక రెండో రోజు నుండి కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయ్యాయి. తొలి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం 8.02 కోట్ల షేర్ సాధించింది. అయితే వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్లకు పైనే జరిగింది.  గౌతమ్ అనే రైటర్ పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ ఇందులో భిన్నమైన రోల్స్ లో కనిపించాడు.

 

రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథెరిన్, ఇ జబెల్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. అయితే  విజయ్ దేవరకొండ, ఐశ్వర్య రాజేష్ ల మధ్య శీనయ్య సువర్ణల ట్రాక్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.   విజయ్ దేవరకొండ స్టామినాపై రక రకాల చర్చలు జరుగుతున్నాయి. 

నైజాం : రూ. 4.03 కోట్లు

సీడెడ్ : రూ. 72 లక్షలు

ఉత్తరాంధ్ర : రూ. 84 లక్షలు

ఈస్ట్ : రూ. 53 లక్షలు

వెస్ట్ : రూ. 41 లక్షలు

గుంటూరు : రూ. 70 లక్షలు

కృష్ణ : రూ. 49 లక్షలు

నెల్లూరు : రూ. 30 లక్షలు

ఆంధ్ర + తెలంగాణ : రూ. 8.02 కోట్లు

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: