బాలీవుడ్లో హీరోలందరూ ఎక్కువగా మంచి బాడీ బిల్డింగ్ తో కనపడుతూ  ఉంటారు అన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లోని ప్రతి హీరోకు మంచి కండలు తిరిగిన దేహం ఉంటుంది. బాడీ ఎక్స్పోజింగ్ కూడా బాగా చేస్తూ ఉంటారు బాలీవుడ్ హీరోలు. అయితే కొత్తగా వచ్చిన హీరోలు కూడా ఎక్కువగా బాడీ బిల్డింగ్ పైన దృష్టి పెడుతుంటారు. ఇకపోతే బాలీవుడ్ లో ఎంత మంది హీరోలు ఉన్నా ఎంతగా కండలు పెంచిన ఎంతగా సిక్స్ ప్యాక్ చేసిన ఒక హీరో మాత్రం అందరికంటే భిన్నంగా కనిపిస్తాడు. ఆ హీరోకు ముందు ఏ హీరో ... ఎవరు సాటిలేరు ఏమో అనిపిస్తూ ఉంటుంది ఆ హీరోను చూస్తుంటే. ఇక సినిమాల్లో హీరో చేసే యాక్షన్  కూడా మామూలుగా ఉండదు. ఇంతకీ నేను ఏ హీరో గురించి చెబుతున్నాను మీకు అర్ధమయ్యే ఉంటుంది. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం. ఈ హీరో స్టైలే వేరు. 

 


 బాలీవుడ్ హీరోల అందరి లో జాన్ అబ్రహం కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆకట్టుకునే ఆకారంతో మగువల గుండెల్లో గుబులు రేకెత్తించే హీరో జాన్ అబ్రహం. ఇప్పటికే బాలీవుడ్లో పలు యాక్షన్ సినిమాల్లో నటించి బ్లాక్బస్టర్ విజయాలను అందుకున్నారు జాన్ అబ్రహం. అయితే తాజాగా ఈ సెక్సీ హీరో కు సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 47 ఏళ్ల ఏస్ లెన్స్ మాన్  డబ్బూ రత్నాని 2020 క్యాలెండర్ పై వచ్చిన పోజు  ప్రస్తుతం ఎంతో మందిని ఆకర్షిస్తోంది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ ఫోటోలో ఒక తెల్ల టవలు తప్ప అతని ఒంటి మీద ఏమి లేదు. ఆ వంటి మీద ఉన్న టవల్ కూడా జారిపోతుంటే పట్టుకుని కనిపించాడు జాన్ ఆగ్రహం. ఇక ఈ ఫోటోలో జాన్ అబ్రహం బాడీ మొత్తం  కనిపించేలా కండలు తిరిగిన దేహాన్ని ప్రదర్శించాడు. 

 


 ఇక ఈ ఫోటో చూస్తే అయితే అసలు చూసినవాళ్లు చూపు తిప్పుకోలేరూ అనడంలో అతిశయోక్తి. ఇక  ఎక్కువగా ఈ ఫోటో అమ్మాయిలను ఎంతగానో ఆకర్షిస్తోంది. అయితే ఒక సాధారణ మోడల్ గా ఉన్నా జాన్ అబ్రహం  బాలీవుడ్ లోకి జిస్మ్  సినిమాతో అడుగుపెట్టాడు. ఇక అప్పటి నుంచి తనకు తిరుగు లేదు అని చెప్పాలి. ముఖ్యంగా జాన్ అబ్రహం లుక్ తో పాటు అతని బాడీ అతనికి ఒక ఆస్తి అని చెప్పాలి. కేవలం కొన్ని సినిమాలో ఛాన్స్ వచ్చేలా చేసింది కూడా అతని బాడీ అనడంలో అతిశయోక్తి లేదు. ఎన్నో కమర్షియల్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు హీరో. కాగా ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఎటాక్ సినిమాలో నటిస్తున్న జాన్ అబ్రహం అలాగే... సత్యమేవ జయతే సీక్వెల్ లో కూడా నటిస్తోన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: