ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పేర్లు వినగానే చాలా మందికి గుర్తుకి వచ్చేది బాహుబలి సినిమానే. ఆ రెండు భాగాలను కూడా రాజమౌళి తెరకెక్కించిన తీరు, కీరవాణి అందించిన సంగీతం అన్నీ కూడా సంచలనమే. రాజమౌళి తన ఆలోచనలకు తగినట్టు సినిమాను రూపొందిస్తే, కీరవాణి రాజమౌళి ఆలోచనలకు తగిన విధంగా సినిమాకు తన సంగీతం అందించారు. ప్రతీ పాట కూడా సంగీతం పరంగా చూస్తే అత్యున్నత ప్రమాణాలతో ఉంటుంది అనేది వాస్తవం. 

 

సినిమాకు తగిన విధంగా, దర్శకుడికి తగిన విధంగా సంగీతం అందించడం అనేది కీరవాణి ప్రత్యేకత. అందుకే వీరి కాంబినేషన్ అంత అందంగా కుదిరింది అంటారు. రెండు భాగాలకు అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. తనకు ఉన్న అనుభవం మొత్తాన్ని కీరవాణి ఈ సినిమాకు ఉపయోగించారు. సీన్ కి తగినట్టు గా సంగీతం అందించారు. రాఘవేంద్రరావు తో ఉన్న అనుబంధం కూడా ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాల్లో కీరవాణి కి ప్లస్ అయింది. ఈ రెండు భాగాలకే సంగీతంలో అవే హైలెట్. 

 

ఇది పక్కన పెడితే రాజమౌళి, కీరవాణి ఇద్దరూ తోడల్లుళ్ళు. రాజమౌళి ప్రేమించి పెళ్లి చేసుకున్న రమా రాజమౌళి, కీరవాణి భార్య శ్రీవల్లి ఇద్దరూ అక్కా చెల్లెళ్ళు. అందుకే వీరిద్దరూ తోడల్లుళ్ళు అయ్యారు. అందుకేనేమో ఈ సినిమా కోసం కీరవాణి ఆ స్థాయిలో కష్టపడ్డారు. వీరి కాంబినేషన్ అంత చక్కగా కుదిరింది. రమా రాజామౌళీ, శ్రీవల్లి ఇద్దరూ కూడా ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారు. దర్శకుడు రాజమౌళిసినిమా అంత అందంగా తెరకెక్కించడానికి కారణం కుటుంబ సహకారమే అంటారు చాలా మంది. రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8 న ప్రేక్షకుల ముందుకి రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: