సంక్రాంతి కానుక రిలీజ్ అయి ఘన విజయం సాధించిన సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు సినిమా సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మహేష్ కెరీర్‌ లోనే బిగ్గెస్ట్ హిట్‌ గా నిలిచింది. దర్శకుడిగా అనిల్‌ రావిపూడి ఈ సినిమాతో స్టార్‌ డైరెక్టర్ల లిస్ట్‌ లోకి చేరిపోయాడు.

 

కళ్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కిన పటాస్‌ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు అనిల్ రావిపూడి. అంతకు ముందు శ్రీను వైట్ల దగ్గర దర్శకత్వశాఖలో పనిచేశాడు అనిల్. అయితే అనిల్‌ రావిపూడి సినిమా అవకాశాలు ఎలా వచ్చాయో చాలా మందికి తెలీదు.

 

అనిల్‌, ఏ అండ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వలేదు. స్వయానా అనిల్ బాబాయ్‌ ఇండస్ట్రీ లో దర్శకుడిగా ఉన్నారు. అంతేకాదు ఆయన పవన్‌ లాంటి టాప్‌ హీరోతో సినిమా చేశాడు. పవన్‌ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా తమ్ముడు. ఈ సినిమాకు దర్శకుడు అరుణ్‌ ప్రసాద్‌. ఈ అరుణ్‌ ప్రసాదే అనిల్ రావిపూడి బాబాయ్.

 

పవన్‌ తో పాటు బాలకృష్ణ, జగపతి బాబు లాంటి స్టార్ హీరోల తోనూ సినిమాలు చేశాడు అరుణ్. తెలుగులో కాదు మాత్రమే కాదు తమిళ్‌ టాప్‌ హీరో విజయ్‌‌, కన్నడ సూపర్‌ స్టార్‌ సుధీప్‌ లతోనే సినిమాలు తెరకెక్కించాడు. ఇలా ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్నఅరుణ్‌ ప్రసాద్‌ సాయం తోనే అనిల్ రావిపూడి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

 

పలువురు టాప్ దర్శకుల దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన అనిల్‌, మాటల రచయితగా చాలా సినిమాల్లో కీలక పాత్ర పోషించాడు. తరువాత దర్శకుడిగానూ తనదైన కామెడీ టైమింగ్‌ తో వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: