సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ  ఆ రంగంలో నిలదక్కుకున్నవారు తమ తోటి వారిని సినిమాల్లోకి తీసుకురావటం సర్వ సాధారణ విషయమే. అయితే కొందరు సినీ రంగంలో నిలదక్కుకున్న వారిని ఆదర్శంగా తీసుకుని మరికొందరు సినీ రంగంలోకి వస్తూంటారు. అలా వచ్చి ఇండస్ట్రీలో సక్సెస్ అయిన వారూ ఉన్నారు. వారిలో రచయిత, దర్శకుడు, నటుడు krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి ఒకరైతే.. కధా రచయిత, దర్శకుడు కొరటాల శివ మరొకరు. వీరిద్దరి మధ్య కూడా చాలా దగ్గరి బంధమే. వీరిరువురూ టాలీవుడ్ లో ప్రముఖులుగా ఎదిగారు.. తమ హవా కొనసాగిస్తున్నారు.

 

 

పోసాని కృష్ణ మురళికి దర్శకుడు కొరటాల శివ స్వయానా మేనల్లుడు అవుతారు. వీరిద్దరి మధ్య ఉన్న అతి దగ్గరి సంబంధం గురించి తొలినాళ్లలో ఎవరికీ తెలియదు. పోసాని కృష్ణ మురళినే ఓ సందర్భంలొ ఈ విషయాన్ని రివీల్ చేశారు. తాను ఎత్తుకుని తిరిగిన కొరటాల శివ కష్టంతో తన తెలివితేటలతోనే ఈ స్థాయికి వచ్చాడని ఆయన ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. తన పెళ్లి చూపులకు కొరటాలను తీసుకెళ్లానని అతను సూచించిన అమ్మాయినే తాను పెళ్లి చేసుకున్నట్టు కూడా చెప్పారు. కొరటాల కథలను కొందరు  కాజేశారని లేకుంటే ఈసరికి ఓ పది సూపర్ హిట్లు ఇచ్చేవాడని పోసాని ఓ సందర్భంలో అన్నారు. ఇలా వీరిద్దరి బంధం అనుబంధం ఆసక్తి రేపుతుంది.

 

 

కొరటాల శివ వరుస సక్సెస్ లతో దూసుకుపోతూ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ఆచార్య అనే టైటిల్ అనుకుంటున్నారని సమాచారం. ఇక పోసాని దాదాపు మూడు దశాబ్దాలుగా సినీ రంగంలో సక్సెస్ ఫుల్ గా తన కెరీర్ కొనసాగించారు. తనదైన స్టైల్లో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తారు. రాజకీయ రంగంలో కూడా పోసాని పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: