ఈ మద్య సెలబ్రెటీలు ఏం చేసినా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.  ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో సంచలన తారగా పేరు తెచ్చుకున్న ప్రియాంక చోెప్రా హాలీవుడ్ పయణం అయ్యింది.  అక్కడ సిరియల్స్ లో నటించి మంచి పేరు సంపాదించింది.  హాలీవుడ్ సింగర్, నటుడు నిక్ జోనస్‌ ని పెళ్లి చేసుకుంది.  ప్రియాంక కన్నా నిక్ జోనస్‌ పదేళ్లు చిన్నవాడు.  నిక్ జోనస్‌ పెళ్లి చేసుకున్న తర్వాత ప్రియాంక ఏం  చేసినా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ముఖ్యంగా ఆమె డ్రెస్సింగ్ విషయంలో దేశ వ్యాప్తంగా చర్చలు నడుస్తున్నాయి. ఇటీవల జరిగిన గ్రామీ అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రియాంక చోప్రా వేసుకున్న గౌన్ డ్రెస్‌ చాలా ఎబ్బెట్టుగా ఉందని నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.

 

అయితే ఆ డ్రెస్ అదిరిపోయిందంటూ ప్రియాంక చోప్రాను కత్రినా కైఫ్ వెనకేసుకొచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న సమయంలో  ప్రియాంక గ్రామీ లుక్‌ గురించి వస్తున్న ట్రోల్స్‌పై స్పందించమని విలేకరి కోరగా..ప్రియాంక గ్రామీ లుక్‌ గురించి నెటిజన్లు ఏమనుకుంటున్నారో నాకు నిజంగా తెలియదు.  ఇటీవల ఆమె ఫోటోలు చూశానని.. ఆ డ్రెస్‌లో తను చాలా అందంగా ఉందనిపించింది. ఈ డ్రెస్ విషయంపై ఆమెను ఎందుకు ట్రోల్ చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు   ఈ విషయంలో బాలీవుడ్ సుందరీమణులు దిశా పటాని, హినా ఖాన్, సుచిత్రా కృష్ణమూర్తి తదితరులు ఇప్పటికే ప్రియాంకకు బాసటగా నిలిచారు.

 

ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో ఆమె ఇష్టం, అది నిర్ణయించటానికి మీరెవరంటూ నెటిజన్స్‌పై సెలబ్రిటీలు సెటైర్లు వేశారు. కాగా,  ప్రతి సంవత్సరం హలీవుడ్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మంగా నిర్వహించే గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం ఈ సంవత్సరం కూడా అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే ప్రియాంక చోప్రా స్కీన్‌, వైట్‌ కలర్‌లో ఉండే ఓ డ్రెస్‌ను ధరించి తన భర్త నిక్‌తో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: