ఈ మధ్య కాలంలో హీరోలందరూ ఎంతో వైవిధ్యం ఒక పాత్రలో నటించడానికి ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. కేవలం పవిత్ర ఆత్మకు పాత్రలో నటించడానికి కాదు ఆ పాత్రకు తగ్గట్లుగా తమ శరీరాన్ని మార్చుకోవడానికి ఎక్కువగా కష్టపడుతున్నారు. ఎంత కష్టమైనా సరే పాత్రకు తగ్గట్టుగా తమ బాడీని మార్చుకొని నటిస్తున్నారు. దంగల్ సినిమా కోసం ఎప్పుడూ ఫిట్గా సిక్స్ప్యాక్లో కనిపించె  అమీర్ ఖాన్  ఎంతో  లావు గా మారిన విషయం తెలిసిందే... ఇక శంకర్ సినిమా కోసం ఏకంగా విక్రమ్ మరీ సన్నగా కూడా మారిపోయి నటించాడు... ఇక ఇప్పుడు హీరో ఆర్య ఓ పాత్ర కోసం ఏకంగా తనని తాను ఎంతో భిన్నంగా మార్చుకున్నాడు. ఎప్పుడు వైవిధ్యమైన కథలను  ఎంచుకుంటూ పాత్రలకు న్యాయం చేస్తూ తన నటనతో అలరిస్తూ ఉంటారు ఆర్య. 

 

 ప్రస్తుతం  ఆలయ గెటప్ చూస్తే అక్కడ ఉన్నది నిజంగా ఆర్యనేనా  అని ఆశ్చర్య పడుతున్నారూ  నెటిజన్లు. ఇటీవలే కప్పం చిత్రంలో కనిపించిన ఆర్య  ప్రస్తుతం మరో చిత్రం టెడ్డి  అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆర్యా  భార్య సాయెష సైగల్  హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది. ఇకపోతే రంజిత్ దర్శకత్వంలో నటించడానికి ఆర్య రెడీ అవుతున్నారు. ఈ చిత్రం కోసం ఏకంగా తనను తాను మార్చుకొని బాడీ బిల్డర్ గా మారిపోయాడు ఆర్య. అయితే ప్రస్తుతం ఆర్య  నటిస్తున్న సినిమాలో బాక్సింగ్ క్రీడాకారుడిగా  కనిపించబోతున్నాడు ఆర్య. దీనికోసం ఆయన బాడీని  పూర్తిగా మార్చుకున్నాడు ఎన్నో కఠిన  కసరత్తులు చేసి సిక్స్ ప్యాక్ ను తయారు చేయడమే కాదు బాడీ  చూస్తుంటే ఔరా అనాల్సిందే.

 

 దీంతో ప్రస్తుతం ఆర్య ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఆర్య బాడీని  చూసిన వాళ్లు అందరూ వావ్ సూపర్ అంటూ  అభినందనల  వర్షం కురిపిస్తున్నారు. ఇక అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒక పాత్ర కోసం ఆర్య  చూపించిన  డెడిటేషన్ కు అందరూ ఫీధా అవుతున్నాయి. అయితే ఈ చిత్రంలో ఇండియన్ మైక్ టైసన్ లాగా  కనిపిస్తున్నాడు ఆర్య. పర్ఫెక్ట్ షేప్  తో... అదిరిపోయే లుక్ తో... ఆర్య అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. ప్రస్తుతం ఆర్య ఫోటో చూస్తే మీరు కూడా అవ్వాక్కవ్వాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: