తెలుగు ఇండస్ట్రీలో లెక్కల మాస్టార్.. దర్శకుడు సుకుమార్ తీసే ప్రతి చిత్రంపై ఎన్నో అంచనాలు నెలకొంటుంటాయి. అల్లు అర్జున్ తో ఆర్య చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న సుకుమార్ తాను తీసే ప్రతి చిత్రంలోనూ అన్ని విషయాల్లో ఓ ఫార్ములాతో ప్లాన్ చేస్తుంటారు. అల్లు అర్జున్ కెరీర్ బిగినింగ్ లో ‘ఆర్య’ టాంటి బ్లాక్ బస్టర్ అందించాడు. ఈ మూవీ ఒక వ్యక్తి ప్రేమించిన అమ్మాయిని ప్రేమిస్తూ తన చుట్టూ తిరిగి చివరికి తనని ప్రేమించేలా చేయం అనే వన్‌సైడ్ లవ్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంతో అల్లు అర్జున్ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
తర్వాత ఆర్య2 తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చినా.... పెద్దగా హిట్ అందుకోలేకపోయారు. తాజాగా మళ్లీ ఇదే ఫార్మాట్‌ని తన కొత్త చిత్రానికి ఫాలో అవుతున్నాడట సుకుమార్. హీరోని నెగెటీవ్ షేడ్స్‌లో ప్రజెంట్ చేసి రెండు సార్లు సక్సెస్ సాధించిన సుకుమార్ ముచ్చటగా మూడవ సారి కూడా అదే చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్య 2 చిత్రంలో బన్నీని నెగిటీవ్ షేడ్స్ తో చూపించినా.. హీరోయిజం కలిసి వచ్చేలా ప్లాన్ చేశాడు. ఈ మద్య ఈ తరహా కాన్సెప్ట్ తో వస్తున్న చిత్రాలకు మంచి ఆదరణ కూడా లభిస్తుంది. ఆ మద్య టెంపర్ చిత్రంలో ఎన్టీఆర్ ఈ తరహా పాత్రలో నటించి హిట్ అందుకున్నాడు.
తాజాగా అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ఓ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం `రంగస్థలం` తరహాలో సహజత్వానికి దగ్గరగా రూపొందుతోంది. త్వరలోనే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్లో హీరో అల్లు అర్జున్ పాల్గొన బోతున్నాడు. సుకుమార్ పై ఎంతో నమ్మకంతో బన్నీ ఈ చిత్రానికి ఓకే చెప్పాడు.. మరి మనోడి ఫార్ములా తంత్రం ఎంత వరకు పనిచేస్తుందో చూడాలి.