నితిన్ న‌టించిన అప్‌క‌మింగ్ ఫిల్మ్ హార్ట్ఎటాక్‌. ఈ మూవీకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు టాలీవుడ్‌లో చ‌క్కెర్లు కొడుతుంది. హార్ట్ఎటాక్ మూవీ ఈ నెల 31న రిలీజ్ కాబోతుంది. పూరిజ‌గ‌న్నాధ్‌, నితిన్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఈ మూవీకు టాలీవుడ్‌లో క్రేజ్ ఏర్పడింది. ఎందుకంటే పూరీజ‌గ‌న్నాధ్ తీస్తున్న ప్రతి మూవీ బాక్సాపీస్ వ‌ద్ద ఏదో అన్నట్టుగా నెట్టుకువ‌స్తుంటే, త‌న‌కి హార్ట్ఎటాక్ మూవీ అనేది చాలా ప్రెస్టేజియ‌స్ అని చెప్పుకున్నాడు. అందుకే ఇద్ద‌ర‌మ్మాయిల‌తో మూవీ త‌రువాత మ‌రో పెద్ద హీరోతో చేయాల్సి ఉండ‌గా, కాద‌నుకొని నితిన్‌తో మూవీను చేశాడు. హార్ట్ఎటాక్ మూవీను క‌సితో తీశాన‌ని పూరిజ‌గ‌న్నాధ్ ప్రెస్‌మీట్‌లో చెప్పుకున్నాడు. ఇదిలా ఉంటే హార్ట్ఎటాక్ మూవీకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్‌ను ఎపిహెరాల్డ్‌.కామ్ మీ ముందుకు తీసుకువ‌చ్చింది. హార్ట్ఎటాక్ మూవీ శాటిలైట్ రైట్స్ చెప్పుకోద్గ రేటుకే అమ్ముడుపోయింది. దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయ‌ల‌కు హార్ట్ఎటాక్ మూవీ శాటిలైట్స్ సేల్ అయిన‌ట్టు టాలీవుడ్ నుండి అందిన స‌మాచారం. ఈ మూవీ శాటిలైట్ రైట్స్‌ను జెమిని టీవి సొంతం చేసుకుంది. నితిన్‌, పూరిజ‌గ‌న్నాధ్ కాంబినేష‌న్‌పై వ‌చ్చిన హార్ట్ఎటాక్ మూవీకు శాటిలైట్ రైట్స్ ఈ రేంజ్‌లో ఉండ‌టంతో, ఇది మూవీకు లాభాన్ని చేకూర్చే విష‌య‌మే అని ట్రేడ్స్ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: