దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ నీడ‌న ఎంతో మంది న‌టులు స్టార్ హీరోలుగా, స్టార్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులుగా ఎదిగారు. ఆయ‌న‌తో చ‌నువు ఉన్న వారిలో ఎంతో మంది ఈ రోజు ఉన్న‌త స్థానాల్లో ఉన్నారు. ఎన్టీఆర్ స‌మ‌కాలీనులుగా ఉన్న వారి త‌న‌యులు.. వారి కుటుంబ స‌భ్యులు కూడా ఈ రోజు సినిమా రంగంలో రాణిస్తున్నారు. అలాంటి వాళ్ల‌లో సీనియ‌ర్ న‌టుడు చ‌ల‌ప‌తి రావు కుటుంబం ఒక‌టి. మహాన‌టుడు ఎన్టీఆర్‌కు చ‌ల‌ప‌తి రావు స‌మ‌కాలీనుడే కాకుండా... ఆయ‌న ప‌క్క‌న ఎన్నో సినిమాల్లో న‌టించాడు.

 

ఎన్టీఆర్ చ‌ల‌ప‌తి రావును ఎంతో ప్రోత్స‌హించారు. అలాగే ఎన్టీఆర్‌కు ఎన్నో విష‌యాల్లో సైతం ఆయ‌న అండ‌గా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ ఇప్పుడు లేక‌పోయ‌నా ఆ త‌ర్వాత ఆ ఫ్యామిలీతో చ‌ల‌ప‌తిరావు అనుబంధం కంటిన్యూ చేస్తూ వ‌స్తున్నారు. చ‌ల‌ప‌తిరావు బాల‌య్య‌తో ఎన్నో సినిమాల్లో క‌లిసి న‌టించారు. అలాగే జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో సైతం కొన్ని సినిమాల్లో న‌టించి ఆ కుటుబంలో మూడో త‌రం తో కూడా త‌న అనుబంధం కంటిన్యూ చేస్తున్నారు. ఇప్ప‌ట‌కీ చ‌ల‌ప‌తిరావుకు ఎన్టీఆర్ కుటుంబంతో అదే అనుబంధం కొన‌సాగుతూ వ‌స్తోంది.

 

ఇక చ‌ల‌ప‌తిరావు కుమారుడే క్రియేటివ్ డైరెక్ట‌ర్ ర‌విబాబు. రవిబాబు విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. సురేష్ మీన‌న్ ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన ర‌విబాబు అంత‌కు ముందు పూణేలోని ప్ర‌తిష్టాత్మ‌క విద్యా సంస్థ నుంచి ఎంబీఏ పూర్తి చేశాడు. ఉన్న‌త ఉద్యోగం వ‌చ్చినా దానిని వ‌దులుకుని మ‌రీ ఈ వృత్తిలోకి వ‌చ్చాడు. సురేష్ మీన‌న్ ద‌గ్గ‌ర అసిస్టెంట్‌గా ప‌ని చేసి సురేష్ ప్రొడ‌క్ష‌న్ నిర్మాణంలో అల్ల‌రి న‌రేష్ హీరోగా వ‌చ్చిన అల్ల‌రి సినిమాతో డైరెక్ట‌ర్‌గా మారాడు. ఆ త‌ర్వాత ర‌విబాబు త‌క్కువ సినిమాలు చేసినా.. అందులో హిట్లు త‌క్కువే అయినా త‌న‌కంటూ ఓ డిఫ‌రెంట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవ‌డంలో మాత్రం స‌క్సెస్ అయ్యాడ‌నే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: