ఈ మద్య స్టార్ హీరోల సినిమాలు మినిమం రూ.200 కోట్లు దాటిపోతున్నాయి.  అంతా ఓకే అయితే అంతకు అంత వసూళ్లు చేస్తున్నాయి.. ఏమాత్రం తేడా వచ్చినా నష్టాల ఊబిలోకి వెళ్లిపోతున్నారు.  గత ఏడాది సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా రూ.350 కోట్ల పెట్టుబడితో తీశారు.  ఈ మూవీ నిర్మాతగా రామ్ చరణ్ వ్యవహరించారు.  అయితే ‘సైరా’ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.  ఇక సుజిత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సాహెూ’ భారీ అంచనాల మద్య రిలీజ్ అయినా.. తెలుగులో మాత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.  ఇక సింహ, లెజెండ్, సరైనోడు మూవీస్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న బోయపాటి శ్రీనివాస్ గతే ఏడాది రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్నాడు.

 

 సాధారణంగా బోయపాటి అంటే భారీ వ్యవంతో కూడుకున్న సినిమాలు అయి ఉంటాయి.  ఆయన ఫైట్స్ సీన్లకే కోట్లు పెడుతుంటారు.  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మార్కెట్‌ని మించి.. 'జయ జానకి నాయక' భారీ నష్టాన్ని పొందారు.  ఇక రాజస్థాన్‌ ఎడారుల్లో చేసుకునే మంచి ఛాన్సు ఉన్నప్పటికీ..   'వినయ విధేయ రామ'లోని యాక్షన్ సన్నివేశాల కోసం అజర్భైజాన్ వరకూ వెళ్లడం.. తద్వారా చరణ్ సినిమా బడ్జెట్‌ పెంచాడనే విమర్శలకు తావిచ్చింది. ఇటీవల కాలంలో బడ్జెట్ విషయంలో బోయపాటి కంట్రోల్ తప్పుతున్నాడనే విమర్శలు వస్తున్నా.. బాలకృష్ణ సినిమాకోసం క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కానంటున్నాడట.

 

'సింహా', 'లెజెండ్' సినిమాల తర్వాత బాలకృష్ణ-బోయపాటి కలయికలో రాబోతున్న ఈమూవీపై ఎంతో క్రేజ్ ఉంది. క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్రెడ్డి నిర్మించే ఈ మూవీ త్వరలో సెట్స్‌కి వెళ్లబోతోంది.  ఈ మూవీలో బాలయ్య అఘోరాగా కనిపించబోతున్నాడని వార్తలు  వస్తున్న విషయం తెలిసిందే. ఏది ఏమైనా తన సినిమాలు జనాలు మెచ్చుకోవాలి.. అందుకు బడ్జెట్ కాస్త ఎక్కువైనా క్వాలిటీ బాగుండాలనే  ఆలోచనలో బోయపాటి ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: