అవార్డులు ఆర్టిస్టులకు ఎనర్జీ ఇస్తాయి. బెస్ట్ పెర్ఫామెన్స్ ఇవ్వాలని బూస్టప్ చేస్తాయి. కానీ ఈ సారి ఫిల్మ్ ఫేర్ అవార్డులు మాత్రం వివాదాలు  తీసుకొచ్చాయి. 65వ ఫిల్మ్ ఫేర్ అన్ ఫేర్ అనే కామెంట్లతో సోషల్ మీడియాతో పెద్ద దుమారం రేగుతోంది.

 

గల్లీబాయ్ కు ఈ ఏడాది ఫిల్మ్ ఫేర్ లో 13అవార్డులు అందుకుంది. బెస్ట్ యాంకర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్ సహా మొత్తం 13 కేటగిరీల్లో అవార్డులు సాధించింది. దీనిపైనే బాలీవుడ్ లో పరస్పరం విరుద్దమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రణ్ వీర్ సింగ్ బెస్ట్ యాక్టర్ ఏంటి.. గల్లీబాయ్ లో ఎక్స్ టెండెడ్ క్యామియో లాంటి పాత్ర పోషించిన ఆలియాభట్ బెస్ట్ యాక్ట్రెస్ ఏంటి అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. 

 

అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ లాంటి వాళ్లను పక్కనపెట్టి రణ్ వీర్ సింగ్ కు బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఇవ్వడం నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. యాక్టింగ్ అంటే నటించడం కేసరిలో అక్షయ్, సూపర్ 30లో హృతిక్ నటించారు. గల్లీబాయ్ లో రణ్ వీర్ ఏం చేశాడు అని ప్రశ్నలేస్తున్నారు. అలాగే బాయ్ కాట్ ఫిల్మ్ ఫేర్ అనే హాష్ ట్యాగ్ తో ఫిల్మ్ ఫేర్ అవార్డులపై విమర్శలు కురిపిస్తున్నారు. 

 

జడ్జిమెంట్ హై క్యా సినిమాలో మెంటల్ మెంటల్ గా నటించిన కంగన రౌనౌత్ కు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ రాలేదని ఆమె చెల్లెలు రంగోళి చందల్ అయితే ఫిల్మ్ ఫేర్ పై విమర్శలు కురిపిస్తోంది. ఇక కేసరి సినిమాలో తాను రాసిన తేరి మిట్టీ పాటకు అవార్డ్ ఇవ్వకపోవడంపై ఫిల్మ్ ఫేర్ పై ఫైర్ అయ్యాడు మనోజ్ ముంతశిర్. ఈ విమర్శలతో అవార్డులు అమ్మబడును ్నే మాటలు మరింత పెరుగుతున్నాయి. మొత్తానికి ఫిల్మ్ ఫేర్ పురస్కారాలపై పెద్ద ఎత్తున దుమారమే రేగుతోంది. 
ఈ వివాదానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: