టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ గత కొంత కాలంగా వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న విషయం తెలిసిందే. రష్మిక మందన విజయ్ దేవరకొండ జోడిగా నటించిన డియర్ కామ్రేడ్ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలైన... ప్రేక్షకుల ఆదరణ పొందలేక బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. మొన్నటికి మొన్న వరల్డ్ ఫేమస్ లివర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. ఏకంగా నలుగురు హీరోయిన్లతో రొమాన్స్ చేసి... లిప్ లాక్ సీన్లు బాగా పెట్టి... నాలుగు షేడ్స్ లో విజయ్ దేవరకొండ నటించిన .... కథలో రొమాన్స్ ముఖ్యం కాదు కంటెంట్ ముఖ్యం అని మరోసారి ప్రేక్షకులు చెప్పకనే చెప్పారు. దీంతో వరల్డ్ ఫేమస్ లవర్ కూడా విజయ్ దేవరకొండ కు నిరాశే మిగిల్చింది .
ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. కాగా ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం ఈ సినిమాకి ఫైటర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. అయితే పూరి జగన్నాథ్ ఇప్పటికే ఇష్మార్ట్ శంకర్ విజయంతో జోష్ మీద ఉన్న విషయం తెలిసిందే... ఈ క్రమంలోనే విజయ్ కి కూడా మంచి హిట్ అందిస్తాడు అని ప్రేక్షకులు అనుకుంటున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఫైటర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటి అనేది అందరిలో ఆసక్తి నెలకొంది.
అయితే పూరి జగన్నాథ్ సినిమాని పూర్తి చేసిన తర్వాత దర్శకుడు మారుతితో కలిసి విజయ్ దేవరకొండ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా విజయ్ దేవరకొండ మారుతికి కాంబినేషన్ లో జరగబోయే సినిమాకు సంబంధించి ఇప్పటికే కసరత్తులు చేస్తున్నాడట దర్శకుడు మారుతి. మారుతి దర్శకత్వంలో ఇటీవల వచ్చిన ప్రతి రోజు పండుగ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కుటుంబ బంధాలు అను బంధాల నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మారుతి విజయ్ కోసం ఎలాంటి కథ సిద్ధం చేస్తున్నారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.