అనుకున్నవన్నీ జరిగితే అదృష్టమనే మాటకు అర్థం లేదు. అసలు లక్ అనేది ఎలా వస్తుందో తెలియదు. ఒక్కోసారి ఒకరి బ్యాడ్ లక్ మరొకటి అదృష్టంగా మారే అవకాశం కూడా ఉంది. అంజలి ఇలానే ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో పార్టనర్ అయింది. ఇంతకీ ఎవరి దురదృష్టం అంజలికి అదృష్టంగా మారింది. 

 

బాలకృష్ణ-బోయపాటి శీను కాంబినేషన్ లో సినిమా లాంచ్ అయినప్పటి నుంచి ఈ మూవీలో హీరోయిన్ గా చాలామంది పేర్లు వినిపించాయి. మహానటి కీర్తి సురేశ్ తో సంప్రదింపులు జరుపుతున్నారని, ఆల్ మోస్ట్ కన్ఫార్మ్ అనే టాక్ కూడా వచ్చింది. కానీ ఈ హీరోయిన్ మాత్రం సీనియర్ స్టార్ కు కాల్షీట్స్ ఇవ్వలేదు. 

 

కీర్తి సురేశ్ తో నో చెప్పాక కేథరీన్, శ్రియలాంటి హీరోయిన్లను పరిశీలించారు బాలకృష్ణ, బోయపాటి. కేథరిన్ అయితే సెట్స్ లో జాయిన్ అయ్యిందనే వార్తలు కూడా వచ్చాయి. మరి వీళ్లు ఏం చెప్పారో తెలియదు గానీ.. ఇప్పుడు అంజలిని తీసుకున్నారనే ప్రచారం సాగుతోంది. బాలయ్యతో సీతమ్మ రెండో సారి జోడీ కడుతోందని చెబుతున్నారు. 

 

అంజలి ఇంతకుముందు బాలకృష్ణతో డిక్టేటర్ సినిమాలో నటించింది. అలాగే బోయపాటి శీను దర్శకత్వంలో వచ్చిన సరైనోడు సినిమాలో బ్లాక్ బస్టర్ స్టెప్పులేసింది. ఈ కెమిస్ట్రీతోనే బాలయ్య,  బోయపాటి ఇద్దరూ అంజలికి  ఓటేశారట. మరి చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం చూస్తోన్న అంజలిని బాలకృష్ణ అయినా ఆదుకుంటాడా అనేది చూడాలి. అంజలి హిట్ కొట్టి చాలా కాలమయింది. హిట్ కోసం  చకోర పక్షిలా ఎదురుచూస్తోంది. అవకాశాల కోసం ఎదురుచూస్తోన్న ఆమెకు.. బాలకృష్ణ రూపంలో వచ్చింది. మరి బాలకృష్ణతో అంజలి కాంబినేషన్ ఏ మాత్రం వర్కవుట్ అవుతుందో లేదో మరి. అంజలి నటనలోనే కాదు.. డ్యాన్స్ లోనూ ఇరకదీస్తుంది. అందమైన తెలుగమ్మాయిగా మురిపిస్తుంది. ఆమెకు అభిమానులు కూడా ఎక్కువే. అంజలి సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: