తెలుగు ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్ చోటా కె. నాయుడు. ఆయన పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేశారు. తెలుగు ఇండస్ట్రీలో టెక్నీషియన్స్ అందరిలోనూ ఆయనకుండే వాల్యూ వేరనే చెప్పాలి. ఇక ఈయన మేనల్లుడే సందీప్ కిషన్. అయితే వీరిద్దరూ ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ. వెంకటాద్రి ఎక్క్‌ప్రెస్ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టి మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన హీరో సందీప్. ఆ తర్వాత కొన్ని సినిమాలు బాగానే ఆడిన తర్వాత ఎవరి కెరియర్లో అయినా సరే అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా కామన్. అలానే సందీప్ కెరియర్లో కూడా మధ్యలో కొన్ని ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ ఇటీవలె ఎవడు చిత్రంతో హిట్ కొట్టారు.
ఇక వీరిద్దరి రిలేషన్ గురించి తీసుకుంటే... అలాంటి ఒక మంచి మామయ్య దొరకడం అనేది నా అదృష్టం. నా సినిమాకి ఆయన డబ్బులు తీసుకోకుండా పని చేశారు. అని చాలా సందర్భాల్లో సందీప్ వాళ్ళ మామయ్య చోటా కె. నాయుడు గురించి స్టేజ్ మీద చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలా ఇద్దరూ ఎంతో మంచి రిలేషన్స్‌ని మెయింటెయిన్ చేస్తారు. ఆకానొక సందర్భంలో చోటాకె.నాయుడు ఇండస్ట్రీలో అందరికీ సన్‌స్ట్రోక్ ఉన్నట్లు నాకు సన్ ఇన్లా స్ట్రోక్ ఉంది. అన్నారు. వీడికి ఆఫర్లు ఇప్పించడం కోసం నేను అవతలి వాళ్ళతో కాస్త కన్వెన్సింగ్లా మాట్లాడాల్సి వచ్చింది అని ఒకానొక సందర్భంలో చెప్పారు.
అలాగే సందీప్ కూడా ఒకసారి కేవలం నావల్లే అవకాశాలు ఇండస్ట్రీలో వస్తున్నాయి అన్న చోటా మాటలకు కాస్త హర్ట్ అయ్యారు. తెలుగు వరకు ఓకే. ఇప్పుడు నేను తమిళ్లో కూడా చాలా సినిమాల్లో నటించాను. అవి అక్కడ సూపర్‌డూపర్ హిట్ అయ్యాయి. మరి అక్కడ ఎవరు చెప్పినా తీసుకోరు. చోటాగారు చెప్పారు కదా అని ఎప్పుడూ ఏ డైరెక్ట్ర్ చెయ్యరు. మనిషి నచ్చితేనే టాలెంట్ ఉంటేనే చేస్తారు అని కాస్త సంచలనంగా మాట్లాడారు. ఏది ఏమైనప్పటికీ ఏవో చిన్న చిన్న మిస్ అండర్స్టాండ్స్ ఉన్నా వీరిద్దరి రిలేషన్ సూపర్.