హీరోయిన్ గా అయ్యేందుకు క్వాలిటీస్ ఏంటి.. అదేంటి ఇలాంటి ప్రశ్న అనుకోవచ్చు. కొద్దిగా అందం.. ఇంకొద్దిగా అభినయం ఉంటే చాలు డజన్ల కొద్ది ఆఫర్లు వచ్చేస్తుంటాయి. అయితే వారిలో కూడా గుర్తించబడే వారి శాతం మాత్రం తక్కువే అని చెప్పొచ్చు. ఇక హీరోయిన్స్ తో పాటుగా వారి పక్కన ఉండే అందాల భామలు తక్కువేం కాదు. కొన్ని సినిమాల్లో సరిగ్గా చూస్తే హీరోయిన్స్ కన్నా వారి పక్కన ఉండే వారే బాగుంటారని అనిపిస్తుంది. అలాంటి ఫీచర్స్ ఉన్న అమ్మాయే కల్పికా గణేష్.  

   

మంచు విష్ణు ప్రయాణం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు సైడ్ రోల్స్ కే పరిమితం అయ్యింది. కొన్ని సినిమాల్లో ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటించగా మరికొన్ని సినిమాల్లో మాత్రం అసలు ఏమాత్రం ఐడెంటిటీ లేని పాత్రల్లో నటించింది. అయితే చాలా సినిమాల్లో కనిపించిన ఈ అమ్మాయి లేటెస్ట్ గా తన హాట్ ఫోటో షూట్ తో షాక్ ఇచ్చింది. ఈ ఫోటో షూట్స్ చూస్తే కల్పిక కూడా హీరోయిన్స్ కు ఏమాత్రం తక్కువ కాదని తెలుస్తుంది.

           

తనలో కూడా హీరోయిన్స్ క్వాలిటీస్ ఉన్నాయని.. ఫోటో షూట్స్ తో షో చేస్తున్న ఈ అమ్మడు ఛాన్సుల కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం కల్పిక ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతకుముందు ఒక సినిమాలో ఫీమేల్ లీడ్ గా ఓ అటెంప్ట్ చేసినా అది వర్క్ అవుట్ కాలేదు. మరి కల్పిక కూడా హీరోయిన్ గా ట్రై చేస్తే బెటర్ అని అంటున్నారు. అమ్మడి ఫోటో షూట్స్ ఏ దర్శకుడి కంట్లో అయినా పడుతాయో లేదో చూడాలి. సైడ్ హీరోయిన్ గా చేస్తున్నా క్రేజీ ఫ్యాన్స్ ఏర్పరచుకున్న వారిలో కల్పిక ఒకరు. ఇక మీదట అయినా అమ్మడికి లక్ కలిసి వస్తుందేమో చూడాలి.         

 

మరింత సమాచారం తెలుసుకోండి: