అవును.. మీరు చదివినది అక్షరాలా నిజం.. ఎందుకు అని అడగొచ్చు.. నయనతార ఒక కాదు రెండు కాదు మూడోసారి ప్రేమలో పడి ప్రస్తుతం మునిగి తేలుతుంది. ప్రేమికుడుతో దేశాల చుట్టూ తిరుగుతుంది ఈ భామ. అయితే ఇప్పుడు అమలాపాల్ కూడా నయనతార బాటలోనే నడుస్తుంది అని టాక్. 

 

ఎలా అంటారా? అదేనండి.. నయనతార మొదట ప్రభుదేవాను ప్రేమించి పెళ్లి వరుకు వెళ్లి.. చేతిపై పచ్చ బొట్టు వేయించుకొని తన ప్రేమను వ్యక్తపరచగా అనుకోని రీతిలో ఇద్దరు విడిపోయారు.. ఆ తర్వాత కూడా ప్రేమంటే చిరాకు లేకుండ మళ్ళి నటుడితో ప్రేమలో పడి పెళ్లి వ‌ర‌కు వెళ్లి విఫలం అయ్యింది. 

 

ఇక నయనతార రెండు లవ్ స్టోరీలు బ్రేక్ అయినా సరే మళ్లీ మళ్లీ ప్రేమలో పడుతూనే ఉంది ఈ తార. ఎవరికైనా ఒకసారి బ్రేకప్ అవుతే ప్రేమ పైన విరక్తి పుడుతుంది.. కానీ ఈ తారకు ప్రేమించిన వాడిపై విరక్తి పుట్టి అక్కడితో ఆపేస్తుంది తప్ప ప్రేమించడం మాత్రం మారటం లేదు. అలానే అమల పాల్ కూడా నయనతార బాటలో నడుస్తుంది అని అంటున్నారు సినీ విశ్లేషకులు. 

 

ఇటీవలే ఓ ఆంగ్ల పత్రికలో ఇలాంటి వార్తే ఒకటి వచ్చింది. అందులో ఏమ‌ని రాశారు అంటే.. అమలాపాల్ కూడా నయనతార బాటలో నడుస్తున్నారు అని.. గతంలో దర్శకుడును ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలాపాల్ కొన్ని కారణాల వల్ల విడిపోయారు అని.. ఇప్పుడు మళ్ళి ఆమె ప్రేమలో పడినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది అని.. 

 

ప్రేమ గురించి బయటకు రాకుండా మ్యానేజ్ చేస్తున్నారు అని.. ఈ విషయాన్నీ ఆమెను అడిగితే ప్రేమలో పడటానికి ఇంకాస్త టైమ్ ఉంది అని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. దీంతో సినీ వర్గాలు కూడా ఆమె నిజంగానే ప్రేమలో పడింది కానీ బయటకు రానివ్వటం లేదు అని గుసగుసలాడుతున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: