సినీ ఇండ‌స్ట్రీలో ఎన్నోసార్లు అమ్మ క్యారెక్ట‌ర్ల‌లో న‌టించి..న‌టించి చివ‌రికి ల‌క్కీ మ‌ద‌ర్‌గా పేరు తెచ్చుకున్న లేడీ ప్ర‌గ‌తి. మోడ్ర‌న్ అమ్మ‌కు నిలువెత్తు రూపంలో క‌నిపించే బ్యూటిఫుల్ లేడీ కొత్త హీరో హీరోయిన్ల‌కు ల‌క్కీ మ‌స్క‌ట్‌గా మారిపోయింద‌ట‌. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే ఈ మ‌ధ్య కాలంలో టాలీవుడ్‌లో ప‌వ‌ర్‌ఫుల్ మ‌ద‌ర్ రోల్స్‌కి గ‌ట్టి డిమాండ్ ఏర్ప‌డింద‌నే చెప్పాలి. న‌దియా, ర‌మ్య‌కృష్ణ‌, ప‌విత్ర‌లు వెండితెర పై అమ్మ‌త‌నానికి హుందాత‌నం తెచ్చిపెట్టారు. అయితే వీరికంటే ఎక్కువ‌గానే అమ్మ క్యారెక్ట‌ర్‌లో చొచ్చుకుపోయిన ప్ర‌గ‌తి క్యూట్ మ‌ద‌ర్‌గానే కాకుండా ల‌క్కీ మ‌ద‌ర్‌గానూ దూసుకుపోతుంద‌ట‌. 

 

నువ్వులేక‌నేను సినిమా నుండి ఆర్తిఅగ‌ర్వాల్‌కు త‌ల్లిగా న‌టించిన ద‌గ్గ‌ర నుండి ఇప్ప‌టి వ‌ర‌కు ఎంద‌రో యంగ్ స్టార్‌ల‌కు అమ్మ‌గా న‌టించి మెప్పించింది ప్ర‌గ‌తి. మూడు ప‌దులు కూడా దాట‌ని వ‌య‌సున్న‌ప్ప‌టికీ రెండింత‌లు పెద్ద‌గా క‌నిపించే క్యారెక్ట‌ర్‌లో న‌టిస్తున్నా కూడా ఎప్ప‌టికీ ఏమాత్రం కూడా ఈమె ఇబ్బంది ప‌డ‌లేదు. ఇక అలాంటి ఆ బ్యూటీఫుల్ లేడీ ప్ర‌స్తుతం ఈ కుర్ర హీరో, హీరోయిన్ల‌కు ల‌క్కీ మ‌స్క‌ట్‌గా మార‌డం నిజంగా విశేష‌మ‌నే చెప్పాలి.

 

టాలీవుడ్‌లో ఎక్కువ‌గా డెబ్యూ మూవీస్ అన్నిట్లో కూడా త‌ల్లి పాత్ర‌లో ప్ర‌గ‌తినే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే ఆమెతో ఎక్కువ‌గా స్క్రీన్ షేర్ చేసుకున్న వాటిలో ఎక్కువ‌గా స్టార్ డ‌మ్ ఉన్న వాళ్ళు చేయ‌డంతో ప్ర‌గ‌తికి ల‌క్కీ మ‌ద‌ర్ అనే ట్యాగ్‌ను త‌గిలిస్తున్నారు. ఓ ర‌కంగా డెబ్యూ హీరో , హ‌రోయిన్ల‌కు ఆమె ల‌క్కీ మ‌ద‌ర్ అనే చెప్పాలి. ప్ర‌గ‌తి అనిల్‌రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఎఫ్‌2 చిత్రంలో హీరోయిన్ల‌కు తల్లి పాత్ర‌లో న‌టించి అంద‌ర్నీ ఆక‌ర్షించింది. ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఈమె బ్యూటీనెస్ ఒక్కోసారి హీరోయిన్ల‌కు పోటీగా కూడా ఉంటుంది. అలాగే తెర మీద ఆమె న‌ట‌న కూడా అద్భుత‌మ‌ని చెప్పాలి. ‘ఏమైంది ఈవేళ’ సినిమాలో హీరో తల్లి పాత్రకు నంది అవార్డు కూడా అందుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: