తెలుగు ఇండస్ట్రీలో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ ఇటీవల కాలంలో తన సంచలన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ సృష్టిస్తున్నారు.  గతంలో ఆయన తీస్తున్న చిత్రాలకు పెద్దగా ఆదరణ రావడం లేదు.  ఆయన తిస్తున్న చిత్రాలు ఎప్పుడూ కాంట్రవర్సీ సృష్టిస్తూ.. రిలీజ్ కి ముందు తెగ హంగామా చేస్తున్నారు.  ఆ మద్య ఏపిలో ఎన్నికల సందర్భంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తెరకెక్కించి పెద్ద దుమారమే లేపారు. ఎంతగా అంటే ఈ చిత్రంలో చంద్రబాబు ని దారుణంగా విమర్శిస్తూ.. వెన్నుపోటు దారుడిగా చిత్రీకరించారని టీడీపీ శ్రేణులు పెద్ద రభస సృష్టించారు. 

 

అయితే ఎన్నికల నేపథ్యంలో ఈ చిత్రం రిలీజ్ చేయకుండా ఈసీ చర్యలు తీసుకుంది.  తర్వాత రిలీజ్ చేసి మంచి కలెక్షన్లే అందుకున్నాడు.  గత ఏడాది ఏపిలో రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు.  ఈ చిత్రం టైటిల్ వివాదం చెలరేగింది.  దాంతో అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అని రిలీజ్ చేశారు.  కానీ ఇది పెద్దగా హిట్ కాలేదు.  కొంత కాలంగా ట్విట్టర్ వేధికగా చేసుకొని రాంగోపాల్ వర్మ చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే సృష్టిస్తున్నాయి.   తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు విచ్చేస్తున్న సంగతి తెలిసిందే.  తన పర్యటనను ఉద్దేశించిన ఆయన మాట్లాడుతూ.. తాను భారత్ పర్యటనకు వస్తే... తనను ఆహ్వానించేందుకు మిలియన్ల మంది ప్రజలు వస్తారని వ్యాఖ్యానించారు.

 

ఈ వ్యాఖ్యలపై  రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో సెటైరిక్ గా ట్వీట్ చేశారు.  ఇండియాలో ట్రంప్ ను 10 మిలియన్ల ప్రజలు ఆహ్వానించాలంటే ఒకటే దారి ఉంది. ట్రంప్ పక్కన అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, రజనీకాంత్, కత్రినా కైఫ్, దీపికా పదుకునే, సన్నీ లియోన్ లను నిల్చోబెడితే అది సాధ్యమే' అంటూ వర్మ తనదైన స్టైల్లో ట్విట్ చేశారు. దాంతో ఆయనపై నెటిజన్లు కూడా స్పందిస్తూ..  కేఏ పాల్, మెగాస్టార్, పవన్ కల్యాణ్ లను మర్చిపోయారంటూ కొందరు రీట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: