టాలీవుడ్ సినిమా వసూళ్ల స్టామినా 100 కోట్లకు చేరిందని ఆనందపడాలో లేక అనవసరమైన ఖర్చులు ఎక్కువయ్యాయని బాధపడాలో తెలియని పరిస్థితి అయ్యింది. తెలుగులో ఒకప్పుడు 50 కోట్ల మార్క్ దాటడమే కష్టం కాగా ఇప్పుడు అన్ని కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు. ఇక స్టార్ హీరో సినిమా అయితే మినిమం 70 నుండి 80 కోట్ల బడ్జెట్ పెట్టాల్సిందే. అయితే దానిలో ఆ హీరోల రెమ్యునరేషన్ సగానికి పైగా ఉంటుందని తెలుస్తుంది.ఈ రేంజ్ కు చేరుకోడానికి చాలా కష్టపడతారు కాబట్టి హీరోల రెమ్యునరేషన్ ఎంతిచ్చినా తక్కువే అనే భావన ఉన్నా సినిమా బడ్జెట్.. వారిచ్చే డేట్స్ ను బట్టి కూడా రెమ్యునరేషన్ డిసైడ్ చేస్తే బెటర్.

 

ఎలాంటి కథ అయినా సరే తనకిచ్చే రెమ్యునరేషన్ మాత్రం హీరోకి ఇవ్వాల్సిందే. ఒకప్పుడు 10 కోట్లకు అటు ఇటుగా ఉన్న హీరోల రెమ్యునరేషన్ ఇప్పుడు పాతిక కోట్లకు పైగా అంటున్నారు. బాహుబలితో ప్రభాస్, వరుస హిట్లతో మహేష్, ఎన్.టి.ఆర్, రాం చరణ్, బన్ని, పవన్ కళ్యాణ్ ఇలా అందరు హీరోలు 20 నుండి పాతిక కోట్ల దాకా డిమాండ్ చేస్తున్నారు. అయితే మహేష్ లాంటి వారు సినిమాకు రెమ్యునరేషన్ నామినల్ గా తీసుకుని బిజినెస్ లో షేర్ తీసుకుంటున్నారు.

 

అయితే నిర్మాతకు ముందు డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి హీరో అడిగిన షేర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మహేష్ సినిమా అంటే బిజినెస్ కు ఢోఖా ఉండదు కాబట్టి మిగిలిన మొత్తంతో సినిమా పూర్తి చేస్తున్నారు. అయితే మిగతా హీరోలు మాత్రం నిర్మాతల దగ్గర ముక్కుపిండి మరి వారి రెమ్యునరేషన్ వసూళు చేస్తున్నారు. సినిమా హిట్టైనా ఫ్లాపైనా హీరోకి సంబందం ఉండదు. వారికిచ్చే రెమ్యునరేషన్ పువ్వుల్లో పెట్టి ఇవ్వాల్సిందే. అయితే ఇప్పుడు హీరోలు కూడా తన మనసు మార్చుకుని నిర్మాతలకు సాయం చేస్తున్నారని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: