జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ తెలుగు రాష్ట్రాలలో ఎంత పాపులారిటీని సంపాదించారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె అడపాదడపా సినిమాలలో కూడా నటిస్తూ తన అందచందాలతో ఎంతోమందిని అలరిస్తోంది. అన్నిటికంటే అత్యంత గొప్పదైన ఆమె మనసుకు చాలామంది ఫిదా అయిపోతుంటారు. మూగజీవులంటే ఎంతో ప్రేమ ఉన్న రష్మీ తనకు చేతనయినంత సాయం చేసి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న జంతువులను కాపాడుతుంది. ముఖ్యంగా ఆమె కుక్కలంటే చాలా ఇష్టం. తను ఇప్పటికే ఎన్నో గాయపడిన కుక్కలకు చికిత్సని అందించి వాటిని అడాప్షన్ కు ఇచ్చిన సందర్భాలు కోకొల్లలు.



అయితే కొన్ని నెలల క్రితం కొంతమంది ఆకతాయి బాలురు ఒక తెల్ల కుక్క పిల్లని తీవ్రంగా కొట్టి దాని ముందు కాలుని విరగ్గొట్టారు. పాపం, ఆ కుక్కపిల్ల నొప్పి తట్టుకోలేక తీవ్ర వేదనతో దారుణమైన పరిస్థితిలో ఉంది. శృతి అనే ఒక యువతి ఈ విషయాన్ని రష్మికి తెలియడంతో ఆమె మనసు చలించిపోయింది. వెంటనే ఆ కుక్క పిల్లని జంతువుల ఆసుప్రతికి తీసుకెళ్ళి దానికి చికిత్సని అందించింది. ప్రస్తుతం ఆ కుక్క పిల్ల యొక్క విరిగిన కాలు కట్టుకుంది. ఈ విషయాన్ని తాను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. అలాగే ఆ కుక్క పిల్లని దత్తత తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఫోన్ నెంబరుకి కాల్ చేయండి అంటూ ఒక పోస్టుని తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. వాస్తవానికి, ఆ ఫోన్ నెంబర్ రష్మిది కాదు. అది జంతువులకు చికిత్స అందించి వాటి సంరక్షణ చూసే పృథ్వి అనే ఒక వ్యక్తి ఫోన్ నెంబర్. ఐతే అది కూడా తెలియని కొంతమంది నెటిజనులు కుక్క పిల్లని అడాప్ట్ చేసుకోమని ఇచ్చిన ఫోన్ నెంబరుకు కాల్ చేసి రష్మితో మాట్లాడాలని అడగసాగారట.



ఈ విషయాన్ని తెలుసుకున్న రష్మి వెంటనే ఇంస్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చి, 'అది నా నెంబర్ కాదండి. అది ఒక సోషల్ వర్కర్ నెంబర్ అండి. తను జాబ్ చేసుకుంటూ, మరోవైపు కుక్కలు ఏ స్థితిలో ఉన్నా వాటిని ఆస్పత్రికి తీసుకొచ్చి దాని బాగోగులు చూస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తికి మీరు కాల్ చేసి ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. కొంచెం అయినా కామన్సెన్స్ ఉండాలి. నేను ఎందుకు నా నెంబరు ఇలా పబ్లిక్ గా పెట్టేస్తాను. నేనే కాదు ఏ సెలబ్రిటీ తమ ఫోన్ నెంబరును పబ్లిక్ గా పెట్టరు. కనీసం ఇది కూడా తెలియకుండా.. కుక్క పిల్లల్ని దత్తత తీసుకోవాలని ఫోన్ నెంబర్ ఇస్తే.. దానికి మీరు ఫోన్ చేసి నా గురించి అడిగితే ఎలా అండీ? ఫోన్ చేసిన ప్రతిసారీ కుక్క పిల్లని అడాప్ట్ చేయడానికి ఫోన్ చేశారోనని పృథ్వి ఆశ పడ్డారు. కానీ మీరు నా గురించి అడిగి వారిని ఎంతో ఇబ్బంది పెట్టారు. ఇప్పటికైనా అతనిని విసిగించకండి. ఫోన్ నెంబర్ అయితే దత్తత ఇవ్వడం వెంటనే జరుగుతుందనే ఉద్దేశంతో నేను ఫోన్ నెంబర్ ఇచ్చాను. కానీ మీరు ఆ నెంబరుకు కాల్ చేసి వారికి శ్రమ కల్పించారు. ఇప్పటికైనా మైండ్ పెట్టి ఆలోచించి ఏం మాట్లాడాలో ఏం చేయాలో తెలుసుకోండి', అని మండిపడింది.

 

ఏదేమైనా మీలో ఎవరైనా కుక్కపిల్లని దత్త తీసుకోవాలనుకుంటే పృథ్వి నెంబరుకు (9603733207) కాల్ చేయగలరు. 

మరింత సమాచారం తెలుసుకోండి: