ఇండియాన్‌ సినిమా ఎళ్లలు దాటేస్తుంది. బడ్జెట్‌, మేకింగ్‌ల పరంగానే కాదు.. కంటెంట్ పరంగా కూడా ఇండియన్‌ సినిమా హద్దులు దాటేస్తోంది. ఇప్పటికే ఇండియన్‌ ఫిలిం మేకర్స్‌ బోల్డ్‌ కంటెంట్‌కు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. తాజాగా అదే బాటలో ఆలోచింప చేసేది రూపొందిన సినిమా శుభ్‌ మంగళ్‌ జ్యాదా సావదాన్‌. ఆయుష్మాన్ ఖురానా, జితేంద్ర కుమార్‌లు ప్రధాన పాత్రల్లో హిందీలో నటించిన రొమాంటిక్ కామెడీ సినిమా 'శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్'. హితేష్ కేవల్య దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో చర్చించిన అంశ కాస్త ఇబ్బంది కరంగానే ఉన్న దర్శకుడు ఆ విషయాన్ని చాలా హుందాగా మనసును తాకేలా రూపొందించాడు.


ప్రస్తుతం ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్సినిమా గురించి ట్వీట్ చేయటం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. బ్రిటీష్ మానవ హక్కుల కార్యకర్త పీటర్ గ్యారీ టాచెల్ శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్  సినిమా చూసి సినిమా గురించి ఓ ట్వీట్ చేశారు. హిందీలో హోమో సెక్సువల్స్‌కు సంబందించి ఓ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ రిలీజయ్యింది. భారత్‌లో స్వలింగ సంపర్కులకు చట్టబద్ధత వచ్చిన తరువాత, ఇప్పుడు విడుదలైన ఈ చిత్రం స్వలింగ సంపర్కం గురించి తెలుసుకోవటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది` అంటూ కామెంట్‌ చేశారు.


ఈ ట్వీట్‌ పై స్పందించిన ట్రంప్‌ గ్యారీ ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ గ్రేట్ అంటూ కామెంట్‌ చేశారు. ఏకంగా అమెరికా అధ్యక్షుడే తమ సినిమాలోని కంటెంట్‌పై కామెంట్ చేయటంతో శుభ్‌ మంగళ్‌ జ్యాదా సావధాన్‌ చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ త‌న భార్య మెలానియాతో క‌లిసి ఈ నెల 24న భార‌త్‌లో ప‌ర్య‌టించ‌నున్న విష‌యం తెలిసిందే. వీరి పర్యటనకు భారత్‌ అదిరిపోయే రేంజ్‌లో ఏర్పాట్లు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: