తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య వరుసగా రిమేక్ చిత్రాలు వస్తున్నాయి.  తమిళ, కన్నడ, మళియాళ, హిందీ భాషల్లో హిట్ అయిన చిత్రాలు తెలుగు హీరోలు లైన్లో పెడుతున్నారు.  చిన్న , పెద్దా అనే తేడా లేకుండా ఎలాంటి మిట్ చిత్రాలైన ఇప్పుడు 'రీ' మేక్ ట్రెండ్ నడుస్తుంది. ప్రస్తుతం కొత్త కథలు దొరికటమే గగనమైపోయింది. ఎప్పుడు రొటీన్ గా వస్తున్న లవ్ స్టోరీలు, యాక్షన్ స్టోరీలు చూసి ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతున్నారు.  దాంతో ఇప్పుడు వెరైటీగా ఏ చిత్రాలు తెరకెక్కినా కంటెంట్ బాగుంటే అవి మంచి హిట్ టాక్ తెచ్చుకోవడం.. కలెక్షన్లు బాగా రాబట్టడం చూసి ఇతర భాషల్లోకి ఆ చిత్రాలు రిమేక్ చేస్తున్నారు.  ఆ మద్య వివివినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల విరామం తర్వాత కత్తి రిమేక్ గా ఖైదీ నెంబర్ 150 తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  

 

ఈ చిత్రం సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.  అంతే కాదు తనిఒరువన్ చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘ధృవ’ గా రిమేక్ చేశారు.   ప్రేక్షకులకు కొత్తదనాన్ని పరిచయం చేయాలంటే కొత్త కథలు పుట్టుకురావాల్సిదే. అందుకే కొత్తదనంతో ఏ భాషలో చిత్రాలు  వచ్చినా వాటిని తమ నేటివిటీకి తగ్గట్టుగా మార్చుకుంటున్నారు దర్శకులు.  ప్రస్తుతం బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయ్యి, తమిళంలో కూడా మంచి విజయం సాధించిన 'పింక్'చిత్రం  'వకీల్ సాబ్' తో రీమేక్ చేస్తున్నారు.

 

ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నారు.  ఇక  తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'అసురన్'   'నారప్ప' చిత్రం రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ హీరోగా నటిస్తున్నారు. వెంకీ ఇప్పటికే 'గురు', 'బాడీగార్డ్' రిమేక్ గా మంచి విజయాలు అందుకున్నాడు.  ఈ మధ్య 'జాను', 'గద్దలకొండ గణేష్', చిత్రాలు కూడా రీమేక్ లుగా వచ్చాయి. ప్రస్తుతం మలయాళంలో సూపర్ హిట్ అయిన 'డ్రైవింగ్ లైసెన్స్'  చిత్రం తీసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: