సాధార‌ణంగా వెండితెరపై నటీనటులు ఎన్నో బంధుత్వాల‌తో నటిస్తుంటారు. అయితే  ఈ  బంధుత్వాలన్నీ రీల్ లైఫ్ లో మాత్రమే. రియల్ లైఫ్ లో వారికి ఎలాంటి  సంబంధాలూ  ఉండవు.  అయితే రియల్ లైఫ్ లో  కూడా చుట్టరికం ఉన్న నటీనటులు మన టాలీవుడ్ లో చాలా మందే ఉన్నారు. అందులో శృతీహాస‌న్ మ‌రియు సుహాసిని కూడా ఉన్నారు. వీరిద్ద‌రి మ‌ధ్య రిలేష‌న్ ఏంటి అన్న‌దే క‌దా మీ డౌట్‌. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం. సుహాసిని 1988లో ప్రసిద్ధ దర్శకుడు మణిరత్నంను పెళ్ళిచేసుంది. వీరికి 15 యేళ్ళ వయసున్న కొడుకు ఉన్నాడు. 

 

సుహాసిని తమిళ, తెలుగు మరియు కన్నడతో పాటు మళయాళము భాషా చిత్రాలలో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది. 1996లో, దర్శకత్వములో అడుగుపెట్టి, జి.వి.ఫిల్మ్స్ నిర్మించిన ఇందిర సినిమాకు దర్శకత్వం వహించింది. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా సుహాసినినే సమకూర్చింది. ఈమె మరియు ఈమె భర్త, తమ సొంత చిత్ర నిర్మాణ సంస్థ, మద్రాస్ టాకీస్ యొక్క నిర్వహణ పనులు చూసుకుంటూ ఉంటారు. ఇంత‌కీ ఈమె ఎవ‌రంటే.. కమల హాసన్ అన్న, నటుడు చారు హాసన్ కుమార్తె సుహాసిని. అంతే సుహాసినికి.. కమల్ హాసన్ బాబాయ్ అవుతాడు. అంటే.. శృతిహాసన్ సుహాసినికి చెల్లెలు అవుతుంది. 

 

ఇక మ‌రోవైపు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మొదట్లో పెద్దగా విజయాలు సాధించకున్నా తెలుగులో పవన్ కల్యాణ్ తో నటించిన ‘గబ్బర్ సింగ్’  సూపర్ హిట్ అయ్యాక హిట్ హీరోయిన్ గా అవతారమెతత్తింది. అప్పటి నుంచి తమిళ, తెలుగు, హిందీ భాషల్లో వరుసగా ఆఫర్లు కొట్టేస్తూ విజయాలు సొంతం చేసుకున్న శృతి హాసన్‌. ఇక వెండితెరపై సూపర్‌హాట్‌గా కనిపించడానికి, ఇంటర్వ్యూలో బోల్డ్‌గా మాట్లాడడానికి అస్సలు వెనుకాడదు శృతీహాసన్‌. సినిమాల్లోకి రాకముందే సంగీత దర్శకురాలిగా పేరు తెచ్చుకుంది. అంతేకాదు అప్పట్లో కమల్ హాసన్, వెంకటేశ్ హీరోలుగా తెరకెక్కిన ‘ఈనాడు’ మూవీకి ఈ భామనే సంగీతం అందించింది.

  

మరింత సమాచారం తెలుసుకోండి: