సాధారణంగా సోషల్ మీడియాలో వస్తున్న చిత్ర విచిత్రమైన సంఘటనలు తెగ వైరల్ అవుతున్నాయి.  అప్పుడప్పుడు సోషల్ మిడియాలో వింత జీవులు తిరుగుతున్నాయని.. అవి తామేదో కొత్తగా కనిపెట్టినట్టు వైరల్ చేస్తుంటారు.  అప్పట్లో వైజాగ్ లో రెండు గుడ్లగూబ పిల్లలను చూసి గ్రహాంతర వాసులు అని తెగ హల్ చల్ చేశారు.  ఇలా ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పెద్ద సంచలనాలు సృష్టిస్తున్నారు.  సాధారణంగా పాములు అంటే ఎవరికైనా భయం అన్న సంగతి తెలిసిందే.  పాములు రోడ్డు పై పాకుతూ.. వెళ్లడం గమనిస్తుంటాం. 

 

ఇప్పుడు ఓ వింత జీవి అలాగే పాకుతూ వెళ్లడం  వైరల్ గా మారింది.  దాంతో అదేదో ఓ వింత జీవి అని.. ఇతర గ్రహం నుంచి వచ్చిందని రక రకాలుగా మాట్లాడుకోవడం.. కామెంట్ చేయడం మొదలు పెట్టారు.   నేచర్‌ ఈజ్‌ మెటల్‌ అనే సంస్థ ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.  అసలు విషయానికి వస్తే.. అది ఎలుక అని దానికి ఓ ప్లాస్టీక్ కవర్ అంటుకోవడంతో.. ఎలుక అచ్చం పాములాగానే మెలికలు తిరుగుతూ పరుగులు పెట్టడంతో అసలు ఇది ఎలుకా లేక పామా అనే సందేహం కలుగుతుంది.  ఆ ఎలుక పరిగెడుతున్న కొద్దీ ఆ తాడు కూడా దాని వెనుకే వెళ్లడంతో అచ్ఛం పాములా కనిపించిందంటూ వెల్లడించారు నేచర్‌ ఈజ్‌ సంస్థ.

 

ఇక దాదాపు 20 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోను 10 లక్షల మందికి పైగా వీక్షించారు. నేచర్‌ ఈజ్‌ మెటల్‌ అనే సంస్థ ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ కి తెగ కామెంట్స్ రావడం.. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా కనిపిస్తాయి.. పాములకు ఎలుకలు అంటే తెగ ఇష్టం.. అలాంటి ఎలుగ పాములా పాకుతూ కనిపించడం నిజంగా చాలా ఫన్నీ విషయం అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: