సుద్ధాల అశోక్ తేజ  పాట‌ల ర‌చ‌యిత. పాట అనేది ఈయ‌న ఇంట్లో పుట్టి పెరిగింది అన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. సుద్ధాల ఇంట్లోనే జాన‌ప‌దం నుంచి జ‌న‌ప‌దం వ‌ర‌కు అన్నీ రాయ‌గ‌ల‌డు. స‌మాజంలో జరుగుతున్న అన్యాయాలు అక్ర‌మాల‌కు పాట ఒళ్ళంతా ఎరుపురంగు పులుముకుంటూ ఉంటుంది. పాట‌తో అంత సాన్నిహిత్యం ఉన్న వ్య‌క్తి కాబ‌ట్టి పాట సాహిత్యం స‌మ‌కూర్చ‌డంలో ఆయ‌న ఈనాడు ఎంతో ఉన్న‌త స్థాయిలో ఉన్నాడు. విప్ల‌వ భావాలున్న ఆయ‌న తెలంగాణ పోరాటంలో కూడా చురుకుగా పాల్గొన్నారు. నిజాం నిరంకుశ పాల‌న‌కు క‌మ్యూనిస్టుల‌తో క‌లిసి క‌దం తొక్కారు. సుద్ధాల అశోక్‌తేజకి ఇద్ద‌రు కుమారులు ఒక కుమార్తె. అంద‌రికీ పెళ్ళిళ్ళు అయిపోయి మంచిపోజీష‌న్స్‌లో సెటిల్ అయిపోయారు. పాటంటే ఆయ‌న‌కు ప్రాణం ప్ర‌ణ‌వం స‌ర్వం. 

 

ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే సుద్ధాల అశోక్ తేజ కొడుకు ఉత్తేజ్ సినిమా రంగంలో ప‌ని చేస్తున్నారు. చిన్న‌నాటి నుంచి అశోక్ రాస్తున్న పాట‌ల‌కు నాట‌కాల్లో పాత్ర‌లు చేస్తూ పెరిగిన ఉత్తేజ్ చేయూత సినీ రంగంలో అశోక్ పాట‌ల ప్ర‌స్థానానికే ఎంతగానో స‌హ‌క‌రించిందే. ఓసారి హైద‌రాబాద్‌లో అశోక్ పాట‌ల క‌చేరి జ‌రుగుతుంది. ఆ కార్య‌క్ర‌మానికి గ‌ద్ద‌ర్ పాత్రికేయుడు శ్రీ‌కృష్ణ వ‌చ్చారు. ఆ కార్య‌క్ర‌మ స‌మాచారాన్ని ప‌త్రిక‌ల్లో చూసిన త‌నికెళ్ళ భ‌ర‌ణి ఉత్తేజ్‌తో ఒక‌సారి మీ మామ‌య్య‌ని తీసుకుర‌మ్మ‌ని అన్నారు. దాంతో త‌నికెళ్ళ భ‌ర‌ణి ద‌గ్గ‌ర‌కి అశోక్ రాసిన పాట‌లు తీసుకుని వెళ్ళార‌ట‌. అలా త‌నికెళ్ళభ‌ర‌ణి సినిమాల్లో అవ‌కాశ మిప్పిస్తాన‌ని ఏమీ చెప్ప‌లేదు. 

 

అశోక్ కూడా సినిమాల కోసం అడ‌గ‌లేదు. కొన్నాళ్ళ త‌ర్వాత కె.రంగారావు ద‌ర్శ‌క‌త్వంలో న‌మ‌స్తే అన్న‌చిత్రం కోసం త‌నికెళ్ళ భ‌ర‌ణి అశోక్‌ని పిలిపించి అవ‌కాశం ఇప్పించారు. అశోక్ రాసిన మొద‌టి పాట గ‌రం గ‌రం పోరి నా గ‌జ్జెల స‌వారి అన్న పాట అప్ప‌ట్లో మంచి హిట్ కొట్టింది. ఆయ‌న‌కు సినారె అంటే చాలా ఇష్టం. మొత్తానికి ఉత్తేజ్ ద్వారానే అశోక్‌కి సినిమాల్లో అవ‌కాశం వ‌చ్చింద‌ని చెప్పాలి. ఆయ‌నే స్వ‌యంగా త‌నికెళ్ళ‌భ‌ర‌ణికి ప‌రిచ‌యం చేయ‌గా అశోక్‌కి సినిమాల్లో పాట‌లురాసే అవ‌కాశం వ‌చ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: