అల్లు అర్జున్ హీరోగా పూజాహెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కి సంక్రాంతికి విడుదలైన అల వైకుంఠపురములో సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమాకు 160 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. ఏపీ, తెలంగాణలోని అల్లు అర్జున్ అభిమానులతో పాటు సగటు సినీ ప్రేమికులు అల వైకుంఠపుములో సినిమా ఇప్పటికే చూసేశారు. 


 దాదాపు సంవత్సరంన్నర గ్యాప్ తీసుకొని అల్లు అర్జున్ నటించిన ఈ సినిమాకు రిలీజ్ రోజే బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో పాటు క్రిటిక్స్ నుండి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. త్రివిక్రమ్ మార్క్ ఎంటర్టైన్మెంట్ అల వైకుంఠపురములో సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా చేసింది. ఈ నెల 26వ తేదీ నుండి సన్ నెక్స్ట్ యాప్ లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

అల వైకుంఠపురములో సినిమా మరోసారి చూడాలనుకున్నా, ఏవైనా కారణాల వలన థియేటర్లలో చూడకపోయినా హాయిగా ఇంట్లోనే కూర్చుని సన్ నెక్స్ట్ యాప్ ద్వారా వీక్షించవచ్చు. మొదట ఈ సినిమా అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8వ తేదీన విడుదలవుతుందని వార్తలొచ్చాయి. కానీ డిజిటల్ ఫ్లాట్ ఫాంలో త్వరగా విడుదల చేస్తే వ్యూస్ పెరగటంతో పాటు లాభాలు వస్తాయని భావించి ఈ నెలలోనే అల వైకుంఠపురములో సినిమాను విడుదల చేస్తున్నారు. సన్ నెక్స్ట్ యాప్ అల వైకుంఠపురములో డిజిటల్ హక్కులను భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేసింది. 
 
నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా రికార్డులు క్రియేట్ చేసిన అల వైకుంఠపురములో ఓటీటీ ఫ్లాట్ ఫాంపై కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని సన్ నెక్స్ట్ వర్గాలు భావిస్తున్నాయి. అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ అయినా కొత్త సినిమాల రాకతో కొన్ని సెంటర్లలో మాత్రమే ప్రదర్శితమవుతోంది. మరో నాలుగు రోజులు ఎదురు చూస్తే అల్లు అర్జున్ అభిమానులు, సినీ ప్రేమికులు సంతోషంగా ఇంట్లోనే కూర్చుని అల వైకుంఠపురములో సినిమాను వీక్షించవచ్చు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: